ఇక రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో భారీ డిజాస్టర్ గా ఏజంట్ సినిమాను చెప్పుకోవచ్చు. ఈ సినిమాను చరణ్ చేయకపోవడంతో అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా, భారీ డిజాస్టర్ అయ్యింది.
చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్న టైమ్ లో, ఏజంట్ కథను చరణ్ కు చెప్పాడట డైరెక్టర్ సురేందర్ రెడ్డి. కాని ఈ కథ రామ్ చరణ్ కు నచ్చలేదని సమాచారం. దాంతో అఖిల్ సినిమా చేసి అతి పెద్ద డిజాస్టర్ ను ఫేస్ చేశాడు. అలా రామ్ చరణ్ 5 సినిమాలను మిస్ అయ్యాడు.