రేణు దేశాయ్ తన ఇంట్లో తరచుగా పూజలు చేయడం చూస్తూనే ఉన్నాం. సందర్భం వచ్చినప్పుడల్లా హిందూ సాంప్రదాయం ప్రకారం రేణు దేశాయ్ అనేక పూజలు చేస్తుంటారు. తాజాగా రేణు దేశాయ్ తన ఇంట్లో గణపతి, చండీ హోమం నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా రేణు దేశాయ్ హోమం చేశారు. ఆ దృశ్యాలని రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.