నటి రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ లో నెమ్మదిగా వేగం పెంచుతోంది. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన పిల్లల బాగోగులు చూసుకుంటున్న సంగతి తెలిసిందే. పెళ్ళికి ముందు రేణు దేశాయ్ బద్రి, జానీ లాంటి చిత్రాల్లో నటించింది. ఇటీవల రేణు దేశాయ్ దర్శకురాలిగా కూడా అదృష్టం పరీక్షించుకుంది.