రెజీనా తెలుగులో పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఎవరు లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించింది. ఇటీవల ఆమె శాకినీ డాకిని అనే చిత్రంలో కూడా నటించింది. త్వరలో రెజీనా నటించిన ఉత్సవం చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 13న ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా రెజీనా ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఓ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలు చెబుతూనే తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఓపెన్ అయింది.