ర్యాంప్ పై కాక రేపిన రెజీనా.. చిరునవ్వులతో కుర్ర హృదయాల్లో అలజడి, కైపెక్కించేలా నిలువెత్తు అందాలు

Published : Feb 20, 2023, 05:44 PM IST

గ్లామర్ హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది.

PREV
19
ర్యాంప్ పై కాక రేపిన రెజీనా.. చిరునవ్వులతో కుర్ర హృదయాల్లో అలజడి, కైపెక్కించేలా నిలువెత్తు అందాలు

గ్లామర్ హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది. ఎవరు లాంటి చిత్రంలో బోల్డ్ పెర్ఫామెన్స్ తో మెప్పించింది. 

29

అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఎవరు చిత్రంలో రెజీనా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. అంతకు ముందు గ్లామర్ రోల్స్ చ్చేసిన రెజీనా ఈ చిత్రంలో కథకు తగ్గట్లుగా బోల్డ్ గా నటించింది. ఇక చివరగా రెజీనా శాకినీ డాకిని అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో మరో లీడ్ రోల్ లో నివేత థామస్ నటించడం విశేషం. 

39

అయితే ఈ చిత్రం  ఆకట్టుకోలేకపోయింది. గ్లామర్ రోల్స్ దొరికితే అందాలు ఆరబోయడానికి రెజీనా వెనకడుగు వేయదు. అలాగని ఆమె కేవలం గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూడడం లేదు. వైవిధ్యం ఉన్న పాత్రలని కూడా ఎంచుకుంటోంది. 

49

కృష్ణ వంశి తెరకెక్కించిన నక్షత్రం చిత్రంలో రెజీనా తడి అందాలు ఆరబోసింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో ఆమె కెరీర్ కి ఏమాత్రం కలసి రాలేదు. అందాలు ఆరబోసినా వృధా అయింది. రెజీనా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా ప్రయత్నాలు చేస్తోంది. 

59

రెజీనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రెజీనా ఒక ఈవెంట్ లో పాల్గొంది. హైదరాబాద్ లో టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సమీకరణ 2023 పేరిట మారియట్ బోన్వాయ్ షాదీ  కార్యక్రమం వెస్టిన్‌ హోటల్‌లో ఘనంగా జరిగింది.  ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు పాల్గొన్నారు.

 

69

టీచ్‌కు మద్దతుగా ప్రముఖ నటీమణులు ర్యాంప్ వాక్ చేయడం ఈ కార్యక్రమంలో జరిగింది.ఈ కార్యక్రమంలో రకుల్ ప్రీత్‌ సింగ్‌, జాకీ భగ్నాని, రెజీనా కసాండ్రా, ఫరియా అబ్దుల్లా, సంధ్య రాజు, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ లాంటి తారలు ర్యాంప్ పై మెరిశారు. 

 

79

2014లో స్థాపించబడిన ఈ సంస్థ ప్రభుత్వ పాఠశాలలో విద్య నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా కొనసాగుతోంది. అంతేకాదు ఫ్లాగ్‌షిప్‌ వాలంటీర్‌ ప్రొగ్రామ్‌, స్మార్ట్‌ క్లాస్‌ రూమ్‌ల నిర్వహణ, ప్రభుత్వ పాఠశాలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు తదితర అంశాల కోసం అవిశ్రాంతంగా కృషిచేస్తోంది.

89

ఈ ఈవెంట్ లో రెజీనా కళ్ళు చెదిరేలా బ్లూ లెహంగాలోఇచ్చిన ఫోజులు మేమరపించేలా ఉన్నాయి. ర్యాంప్ పై మెరుపులు మెరిపిస్తూ రెజీనా ఎంతో అందంగా వాక్ చేసింది. ఆమె చిరునవ్వులు కుర్రాళ్ల హృదయాల్ని కొల్లగొడుతున్నాయి. 

99

ఇటీవల రెజీనాని నెటిజన్లు మ్యాగీ పాప అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. శాకినీ డాకిని ప్రమోషన్స్ లో రెజీనా 'అబ్బాయిలు, మ్యాగీ రెండూ 2 నిమిషాలలో అయిపోతాయి' అంటూ అడల్ట్ జోక్ వేసింది. ఇప్పుడు ఆమె ఫోటోలకు నెటిజన్లు మ్యాగీ పాప అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

click me!

Recommended Stories