Bheemla Nayak: బండ్ల గణేష్ తో అప్ సెట్.. త్రివిక్రమ్ మాట్లాడక పోవడానికి మరో కారణం ఉందా ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 24, 2022, 02:27 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంటే హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది.

PREV
17
Bheemla Nayak: బండ్ల గణేష్ తో అప్ సెట్.. త్రివిక్రమ్ మాట్లాడక పోవడానికి మరో కారణం ఉందా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంటే హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. అమలాపురం నుంచి అమెరికా వరకు పవన్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ జపం చేస్తున్నారు. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతం అయింది.   

27

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేసిన కొత్త ట్రైలర్ ఫ్యాన్స్ కి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ అతిథులుగా హాజరయ్యారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ప్రాణ మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 

 

37

త్రివిక్రమ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరైనప్పటికీ వెనుకే ఉండిపోయారు. వేదికపై కూడా ఆయన ఎక్కువగా కనిపించలేదు. సాధారణంగా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ గురించి ఎలా మాట్లాడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది త్రివిక్రమ్ మాట్లాడకపోవడం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. 

47

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ మాట్లాడకపోవడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ఇటీవల బండ్ల గణేష్ ఫోన్ కాల్ ఆడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఆడియోలో బండ్ల గణేష్ త్రివిక్రమ్ ని తిడుతూ ఉన్న వాయిస్ ఉంది. తాను భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కావడం లేదని, అందుకు కారణం త్రివిక్రమ్ అని బండ్ల గణేష్ ఆరోపిస్తున్నట్లు ఆ ఆడియోలో ఉంది. 

57

 ఈ ఆడియో లీక్ నెట్టింట పెద్ద రచ్చగా మారింది. ఈ ఆడియో లీక్ వల్ల త్రివిక్రమ్ బాగా అప్ సెట్ అయ్యారనే ప్రచారం జరిగింది. దీనివల్లే త్రివిక్రమ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడలేదని అంటున్నారు. 

67

అలాగే త్రివిక్రమ్ మాట్లాడకపోవడానికి  కారణం కూడా ఉందని అంటున్నారు. భీమ్లా నాయక్ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి దర్శకుడు సాగర్ చంద్రకి ప్రాధాన్యత దక్కడం లేదని.. అంతా త్రివిక్రమ్ చూసుకుంటున్నారని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. దీనితో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాగర్ చంద్ర బాగా హైలైట్ అయ్యేలా త్రివిక్రమ్ తెరవెనుకే ఉండిపోయారని అంటున్నారు. మొత్తంగా త్రివిక్రమ్ భీమ్లా నాయక్ ఈవెంట్ లో మాట్లాడక పోవడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. 

77

పవన్ ఫ్యాన్స్ లో, ట్రెండ్ వర్గాల్లో భీమ్లా నాయక్ చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా తొలిసారి నిత్యామీనన్ నటిస్తోంది. అలాగే రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. మురళి శర్మ, రావు రమేష్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories