బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం, సామాన్యుడిగా పల్లవి ప్రశాంత్ రికార్డ్.. రైతు బిడ్డకి ఎలా సాధ్యమైందో తెలుసా

First Published | Dec 17, 2023, 11:01 PM IST

ఒక సామాన్యుడు బిగ్ బిగ్ బాస్ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. గత సీజన్స్ అన్నింటిలో చిత్ర పరిశ్రమలో ఎంతోకొంత పాపులర్ అయిన సెలెబ్రిటీలే టైటిల్ గెలుస్తూ వచ్చారు. కానీ పల్లవి ప్రశాంత్.. శివాజీ, అమర్ దీప్ లాంటి వాళ్ళని దాటుకుని టైటిల్ గెలిచేశాడు.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే కోసం ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం వచ్చేసింది. బిగ్ బాస్ 7 విజేత ఎవరో తెలిసిపోయింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ గ్రాండ్ స్టైల్ లో ప్రారంభం అయింది. టైటిల్ కోసం అర్జున్, ప్రశాంత్, శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్ దీప్, ప్రియాంక పోటీ పడ్డారు.

కానీ తీవ్ర ఉత్కంఠ నడుమ బిగ్ బాస్ విజేతగా నాగార్జున పల్లవి ప్రశాంత్ పేరు ప్రకటించారు. సామాన్యుడిగా హౌస్ లోకి అమాయకంగా వెళ్లిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విజేతగా దిగ్విజయంగా బయటకి వచ్చాడు. తెలంగాణ కుర్రాడిగా సిద్దిపేట జిల్లా మారుమూల గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్ అసలు బిగ్ బాస్ అవకాశం వస్తుందని కూడా ఊహించలేదు. కానీ అవకాశం రావడం మాత్రమే కాదు ఏకంగా టైటిల్ గెలిచి రికార్డు సృష్టించాడు. 


ఒక సామాన్యుడు బిగ్ బిగ్ బాస్ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. గత సీజన్స్ అన్నింటిలో చిత్ర పరిశ్రమలో ఎంతోకొంత పాపులర్ అయిన సెలెబ్రిటీలే టైటిల్ గెలుస్తూ వచ్చారు. కానీ పల్లవి ప్రశాంత్.. శివాజీ, అమర్ దీప్ లాంటి వాళ్ళని దాటుకుని టైటిల్ గెలిచేశాడు. ప్రశాంత్ కి ప్రైజ్ మనీతో పాటు మారుతి బ్లేజర్ కారు, 15 లక్షలు విలువ చేసే జోయాలుక్కాస్ బంగారు ఆభరణాలు దక్కుతాయి. 

బిగ్ బాస్ హిస్టరీలో ప్రశాంత్ కి ఈ రికార్డు ఎలా సాధ్యమైంది. అనుకూలించిన అంశాలు ఏంటి ? అతడి కష్టం ఎంత ఉంది  ? లాంటి విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ప్రశాంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రేక్షకులకు అతడిపై ఈ స్థాయిలో అంచనాలు లేవు. చాలా మంది ప్రశాంత్ త్వరగా ఎలిమినేట్ కాడు.. అలాగని టాప్ 5 లోకి చేరే సత్తా కూడా లేదు. కొన్ని వారలు హౌస్ లో ఉంటాడు లే అని అనుకున్నారు. 

కానీ వారం వారం గడిచే కొద్దీ అతడిపై ప్రేక్షకుల ఫోకస్ పెరుగుతూ వచ్చింది.  బిగినింగ్ లో రతికతో ప్రశాంత్ ఫ్రెండ్ షిప్ చిలిపి వేషాలు అతడికి పాపులారిటీ తెచ్చిపెట్టాయి. రతికతో జరిగిన గొడవలు కూడా ప్రశాంత్ కే కలసి వచ్చాయి. అమాయకంగా ఉంటూనే రతిక తో చిన్నపాటి రొమాంటిక్ వేషాలు వేశాడు ప్రశాంత్. ఈ చేష్టలు ఆడియన్స్ కి బాగా నచ్చేశాయి. ఇవి తప్ప పెద్దగా ప్రశాంత్ వివాదాల్లో చిక్కుకోలేదు. తనపై నెగిటివిటి పెరిగేలా ప్రశాంత్ ఎప్పుడూ ప్రవర్తించలేదు. 

కొన్ని సార్లు ప్రశాంత్ తాను చేసిన తప్పులని డిఫెండ్ చేసుకోవడంలో తడబడ్డాడు. కానీ అది ప్రశాంత్ కి అంత ప్రమాదం కాలేదు. రతిక మొదటి సారి ఎలిమినేట్ అయ్యాక శివాజీ, యావర్ లతో ఫ్రెండ్ షిప్ పెరుగుతూ వచ్చింది. వాళ్ళతో ఫ్రెండ్ షిప్ చేస్తూనే టాస్క్ లు వచ్చినప్పుడు గట్టిగా పోరాడాడు. ప్రతి టాస్క్ లో ప్రశాంత్ మినిమమ్ పెర్ఫామెన్స్ ఇవ్వడం అతడికి ప్లస్ ఐయ్యింది. 

ఈ క్రమంలో హౌస్ లో శివాజీ బ్యాచ్.. సీరియల్ బ్యాచ్ అంటూ రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ప్రియాంక, శోభా శెట్టి, అమర్ దీప్ కొన్ని సార్లు ప్రశాంత్ ని టార్గెట్ చేయడం కూడా అతడికి కలసి వచ్చింది. అమర్, శోభా, ప్రియాంక.. ప్రశాంత్ పై వాయిస్ పెంచిన సమయంలో అతడిపై సింపతీ పెరుగుతూ వచ్చింది. దానికి తోడు ప్రశాంత్ సహనం ఎక్కడ కోల్పోలేదు. 

తాను రైతు బిడ్డగా తనలాంటి యువకులకు, రైతులకు ఆదర్శనంగా నిలవాలనే ఈ హౌస్ కి వచ్చినట్లు తరచుగా గుర్తు చేసేవాడు. ఈ పాయింట్ జనాల్లోకి బాగా వెళ్ళింది. మరోసారి రతిక వచ్చినప్పుడు అక్క అని పిలవడం ప్రశాంత్ హైలైట్ అయ్యేలా చేసింది. 

ఇక గేమ్ చివరి వారాలకు చేరే సమయంలో అమర్, శోభా, ప్రియాంక ఎక్కువగా ప్రశాంత్ ని టార్గెట్ చేశారు. అమర్ సహనం కోల్పోవడం అతడికి మైనస్ గా మారితే.. అది ప్రశాంత్ కి ప్లస్ అయింది. సామాన్యులంతా ప్రశాంత్ వైపే అంటూ ఓట్లు గుద్దేసారు.పల్లవి ప్రశాంత్ గెలవాలని ట్రెండింగ్ కూడా చేశారు. మొత్తంగా చూసుకుంటే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ రియాలిటీ షోలో ఒక హిస్టరీ క్రియేట్ చేశాడు అని చెప్పొచ్చు. 

Latest Videos

click me!