సోనూ సోషల్ మీడియా పేజ్‌లకు పోటెత్తుతున్న అభ్యర్థనలు

First Published Aug 20, 2020, 12:23 PM IST

వందలాది బస్సులను ఏర్పాటు చేసి వేల మందిని సొంత గ్రామాలకు చేర్చాడు. విదేశాల్లో చిక్కుకున్న వారిని కూడా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ఇండియాకు రప్పించాడు. ఇప్పటికీ కొంత మంది తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. అదే సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలపై కూడా సోనూ స్పందించాడు.

లాక్ డౌన్‌ సమయంలో విలన్ సోనూ సూద్ ఒక్కసారిగా రియల్ హీరో అయిపోయాడు. ఈ కష్టకాలంలో వేలాది మందికి తన సొంత డబ్బులతో సాయం చేయటమే కాదు ఇప్పటికీ తనకు వస్తున్న మెసేజ్‌లపై స్పందిస్తునే ఉన్నాడు సోనూ సూద్‌. ముఖ్యంగా లాక్‌ డౌన్‌ సమయంలో సొంత గ్రామాలకు వెళ్లకుండా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు చేర్చటంలో సోనూ చేసిన కృషిని అందరూ ప్రశంసిస్తున్నారు.
undefined
వందలాది బస్సులను ఏర్పాటు చేసి వేల మందిని సొంత గ్రామాలకు చేర్చాడు. విదేశాల్లో చిక్కుకున్న వారిని కూడా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ఇండియాకు రప్పించాడు. ఇప్పటికీ కొంత మంది తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. అదే సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలపై కూడా సోనూ స్పందించాడు.
undefined
తెలుగు రాష్ట్రాల్లో రైతుకు ట్రాక్టర్ పంపించటం, ఉద్యోగం కోల్పోయిన అమ్మాయికి జాబ్ ఇప్పించటం లాంటి అంశాలు సోనూ ఇమేజ్‌ను తారా స్థాయికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో కష్టాల్లో ఉన్న చాలా మంది తమ సమస్యలు తీర్చమని సోనూ సూద్‌ను అభ్యర్థిస్తున్నారు. ఈ మేరకు ఆయనకు వేల సంఖ్యలో మెసేజ్‌లు వస్తున్నాయి.
undefined
ఈ రోజు ఉదయం ఈ మేరకు సోనూ సూద్‌ ఓ మెసేజ్‌ చేశాడు. `1137 మెయిల్స్‌, 19000 ఫేస్‌ బుక్‌ మెసేజ్‌లు, 4812 ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లు, 6741 ట్వీటర్‌ మెసేజ్‌లు ఈ రోజు నాకు వచ్చిన అభ్యర్థనలు. రోజూ దాదాపు ఇదే స్థాయిలో మెసేజ్‌లు వస్తున్నాయి. మనిషిగా నాకు సాధ్యమైనంత మందికి సాయం చేస్తున్నాను. ఎవరికైనా సాయం అంధించలేకపోతే క్షమించండి` అంటూ ట్వీట్ చేశాడు సోనూసూద్.
undefined
click me!