జేడీ చక్రవర్తి చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని, ఇమేజ్‌ని ఏర్పర్చుకున్నారు. `శివ`, `గులాబీ`, `మనీ మనీ`, `బొంబాయి ప్రియుడు`, `ఎగిరే పావురం` వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. హిందీలోనూ `సత్య`, `ఆగ్` వంటి సినిమాలు చేశారు. కానీ ఇటీవల కాలంలో ఆయన తెలుగులో సినిమాలు చేయలేదు. చాలా గ్యాప్ వచ్చింది. బాలీవుడ్‌కి వెళ్లడం వల్ల ఇక్కడ గ్యాప్ వచ్చిందన్నారు. ఇకపై ఇక్కడ నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.