Raviteja: ఈ స్టార్‌ హీరో వల్ల రవితేజకి 5 బ్లాక్‌ బస్టర్స్.. మాస్‌ మహారాజాకి లైఫ్‌ ఇచ్చింది ఎవరో తెలుసా?

Published : Feb 08, 2026, 06:51 PM IST

రవితేజ తన కెరీర్‌లో ఎన్నో హిట్స్ అందుకున్నారు. కానీ ఆయన అందుకున్న బ్లాక్‌ బస్టర్స్ వెనుక ఒక స్టార్‌ హీరో ఉన్నారు. ఆయన వదులుకున్న చిత్రాలతో మాస్‌ మహారాజా సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. 

PREV
17
రవితేజకి సక్సెస్‌ లు ఆమడ దూరం

మాస్‌ మహారాజా రవితేజ ఇటీవల సక్సెస్‌ లు లేక స్ట్రగుల్‌ అవుతున్నాడు. మాస్‌ సినిమాలు చేసినా, యాక్షన్‌ సినిమాలు చేసినా, థ్రిల్లర్స్ చేసినా, చివరికి ఫ్యామిలీ స్టోరీస్‌ చేసినా సక్సెస్‌ రావడం లేదు. ఈ సంక్రాంతికి ఆయన `భర్తమహాశయులకు విజ్ఞప్తి` అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. ఫ్యామిలీ కథ అయినా, ఫన్‌ ఉన్నా కూడా ఆడియెన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. దీంతో మరో ఫ్లాప్‌ తప్పలేదు. అయితే ఒకప్పుడు మాత్రం రవితేజ కెరీర్‌ పీక్‌లో ఉండేది. వరుస బ్లాక్‌ బస్టర్స్ తో స్టార్‌ హీరోగా రాణించారు.

27
ఆ సూపర్ స్టార్‌ వల్ల తిరుగులేని స్టార్‌గా ఎదిగిన రవితేజ

ఇండస్ట్రీలో సాధారణంగా ఒకరికి అనుకున్న కథ మరొకరి వద్దకు వెళ్లడం కామనే. ఒక హీరోకి నచ్చకపోతే మరో హీరోకి కథ చెబుతారు దర్శకులు. ఇలా ఎవరో ఒకరు ఓకే చెప్పడంతో అది పట్టాలెక్కుతుంది. అయితే రవితేజ విజయాలు అందుకున్న వాటిలో ఎక్కువగా ఒకే హీరో రిజెక్ట్ చేయడం వల్ల వచ్చాయి. ఓ స్టార్‌ హీరో రిజెక్ట్ చేసిన ఐదు సినిమాలు తాను చేసి బ్లాక్‌ బస్టర్స్ అందుకున్నారు మాస్‌ మహారాజా. అందులో ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి.  అలా రవితేజకి పరోక్షంగా లైఫ్‌ ఇచ్చిన స్టార్‌ హీరో ఎవరనేది చూస్తే,

37
పవన్‌ కళ్యాణ్‌ వదిలేసిన సినిమాలతో స్టార్‌గా ఎదిగిన రవితేజ

మాస్‌ మహారాజా రవితేజకి లైఫ్‌ ఇచ్చిన హీరో ఎవరో కాదు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌. ప్రస్తుతం ఆయన ఆంధ్ర ప్రదేశ్‌కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పవన్‌ కళ్యాణ్‌ రిజెక్ట్ చేసిన సినిమాలతోనే రవితేజ హిట్స్ అందుకున్నారు. తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. అలా పవన్‌ వదులకున్న చిత్రాల్లో `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం` మొదటగా చెప్పొచ్చు. ఈ మూవీని దర్శకుడు పూరీ జగన్నాథ్‌ మొదట పవన్‌కే చెప్పారు. ఆయన నో చెప్పడంతో రవితేజ వద్దకు వెళ్లింది. అప్పటి వరకు హీరోగా నిలబడేందుకు స్ట్రగుల్‌ అవుతున్న రవితేజకి ఈ మూవీ హిట్‌ ఇచ్చి హీరోగా నిలబెట్టింది.

47
రవితేజకి బ్రేక్‌ ఇచ్చిన `ఇడియట్‌`

ఆ తర్వాత పవన్‌ వదులుకున్న సినిమాలో `ఇడియట్‌` కూడా ఉంది. ఈ చిత్ర కథని కూడా పూరీ జగన్నాథ్‌ మొదట పవన్‌కే చెప్పారు. కానీ ఆయన చేయలేదు. చాలా ప్రయత్నించినా వర్కౌట్‌ కాలేదు, దీంతో రవితేజ వద్దకు వెళ్లింది. మాస్‌ మహారాజా సినిమా చేశాడు, బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఆ టైమ్‌లో ఇది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. రవితేజకి బిగ్గెస్ట్ బ్రేక్‌ ఇచ్చింది. సూపర్‌ స్టార్‌ని చేసింది. లవ్‌ స్టోరీస్‌లో ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది.

57
`అమ్మ నాన్న తమిళ అమ్మాయి`ని పవన్‌ రిజెక్ట్ చేశాడు

రవితేజ, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన మరో మూవీ `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి`. ఆసిన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ బాక్సింగ్‌ నేపథ్యంలో సాగుతుంది. లవ్‌ స్టోరీ కూడా కొత్తగా ఉంటుంది. దీంతో ఇది బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ కథని కూడా దర్శకుడు పూరీ మొదట పవన్‌ కళ్యాణ్‌ కే చెప్పాడట. కానీ ఆయన చేయలేదు. బిజీగా ఉండటం వల్ల నో చెప్పాడట. దీంతో రవితేజ వద్దకు వెళ్లింది. ఆయన చేశాడు, హిట్‌ కొట్టాడు.

67
`విక్రమార్కుడు`తో రవితేజ కెరీర్‌ పీక్‌

రవితేజ కెరీర్‌ని పీక్‌లోకి తీసుకెళ్లిన మూవీ `విక్రమార్కుడు`. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఆ టైమ్‌లో ఇది కూడా ఇండస్ట్రీ హిట్‌గా చెప్పొచ్చు. ఈ మూవీని పవన్‌ కళ్యాణ్‌ తో చేయలనుకున్నారట రాజమౌళి. ఆయన్ని కలిశాడట. కానీ కాంబినేషన్‌ వర్కౌట్‌ కాలేదు. ఆ టైమ్‌లో వేరే చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల నో చెప్పారట. అలా రవితేజకి మూవీ వచ్చింది. వచ్చిన ఛాన్స్ ని కరెక్ట్ గా వాడుకున్నాడు, బ్లాక్‌ బస్టర్‌ కొట్టాడు. తిరుగులేని సూపర్‌ స్టార్‌ గా ఎదిగాడు రవితేజ.

77
మిరపకాయ్‌ని కూడా వదులుకున్న పవన్‌

రవితేజ, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ మూవీ `మిరపకాయ్‌`. ఈ సినిమా స్టోరీని ముందు పవన్ కే చెప్పాడు హరీష్‌ శంకర్‌.  ఆయన నో చెప్పాడు. దీంతో రవితేజతో చేశారు. ఇది డీసెంట్‌గానే ఆడింది. ఇలా పవన్‌ వదిలేసుకున్న చిత్రాలతో బ్లాక్‌ బస్టర్స్ అందుకుని సూపర్‌ స్టార్‌గా ఎదిగారు రవితేజ. పరోక్షంగా రవితేజ స్టార్‌ కావడంలో పవన్‌ కళ్యాణ్‌ పాత్ర ఎంతో ఉందని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories