Guppedantha Manasu: వనబోజనాలకు బయల్దేరిన మహీంద్రా కుటుంబం.. న్యాయం చెప్పటానికి బయల్దేరిన రిషి, వసుధార!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 02, 2021, 12:24 PM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
19
Guppedantha Manasu: వనబోజనాలకు బయల్దేరిన మహీంద్రా కుటుంబం.. న్యాయం చెప్పటానికి బయల్దేరిన రిషి, వసుధార!

రిషి (Rishi) తన గదిలో ఒంటరిగా కూర్చొని వసు గురించి ఆలోచిస్తాడు. తనలో ఎందుకు ఇంత మార్పు వచ్చిందని తనలో తానే ప్రశ్న వేసుకుంటాడు. అప్పుడే మహేంద్రవర్మ (Mahendra) రావడంతో కాసేపు వెటకారంగా మాట్లాడుతాడు.
 

29

ఇక మహేంద్రవర్మ (Mahendra) రిషి మాటలను సర్దిచెప్పి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఉదయాన్నే రిషి (Rishi) వాళ్ళ పెదనాన్న ఇంట్లో వాళ్లందరినీ పిలిపించి ఓ చోటకు వెళ్తున్నామని అంటాడు. అప్పుడే రిషి, మహేంద్ర వర్మ తమకు ఆ విషయం తెలుసని అంటారు.
 

39

వెంటనే దేవయానికి (Devayani) కోపం వస్తుంది. మీ అందరికీ తెలిశాక నాకెందుకు చెప్పడమని అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుండగా రిషి తనను ఆపి ఎడ్యుకేషనల్ కమిషనర్ కార్తీక మాసం సందర్భంగా వనభోజనాలు ఏర్పాటు చేశాడని చెప్పటంతో కాసేపు రానని రిషితో (Rishi) బ్రతిమాలిపించుకుంటుంది.
 

49

మొత్తానికి ధరణి (Dharani) కోసం, రిషి కోసం వస్తాను అని చెబుతుంది. మరోవైపు జగతికి కమిషనర్ ఫోన్ చేసి వనభోజనాలకు రమ్మని ఆహ్వానిస్తాడు. అప్పుడే వసును కూడా రమ్మనడంతో వసు మురిసి పోతుంది. అప్పుడే మహేంద్ర వర్మ (Mahendra) వస్తాడు.
 

59

మహేంద్ర తో కమిషనర్ సార్ భోజనానికి రమ్మన్నాడు అని చెబుతోంది. ఇక మిమ్మల్ని కూడా పిలిచారని కానీ నేను రానని అక్కడ దేవయాని (Devayani) తనను అందరిముందు బాధపెట్టేలా చేస్తుంది అని అనడంతో  వసు, మహేంద్ర వర్మ (Mahendra) తనను బ్రతిమాలుతారు.
 

69

నువ్వు వస్తేనే మేము వస్తాం అంటూ మారం చేయటంతో అప్పుడు ఒప్పుకుంటుంది జగతి (Jagathi) . ఇక మహేంద్రవర్మ అక్కడనుంచి వెళ్ళిపోతాడు. ఇక వన భోజనానికి రెడీ అవగా రిషి కారు హారన్ మోగుతుంది. రిషి (Rishi) సార్ వచ్చాడని వెళ్లి డోర్ తీయటంతో రిషి వస్తాడు.
 

79

జగతి (Jagathi) కూడా రిషి దగ్గరికి వస్తుంది. వెంటనే రిషి (Rishi) వసుతో రెడీ అయ్యావా వెళ్దామా అని అనేసరికి  వసు ఆశ్చర్యపోతుంది. ఎక్కడికి సార్ అని ప్రశ్నిస్తుంది. అప్పుడే జగతి వనభోజనాల కోసం వెళ్లాలనుకుంటున్నాము సార్ అని అనడంతో నేను అక్కడికి వెళ్తున్నాను.
 

89

కానీ ఇద్దరం కలిసి వెళ్తామని అంటాడు. దారి మధ్యలో మిషన్ ఎడ్యుకేషన్ గురించి స్థలం చూస్తామని అంటాడు. ఇక జగతి (Jagathi)ఒప్పుకోవడంతో వసు రిషితో (Rishi) వెళ్ళిపోతుంది. కారులో కూర్చుని వసు, రిషి లు మాట్లాడుకుంటారు.
 

99

రిషి (Rishi) ప్రవర్తనను చూసి వసు మీలో చాలా మార్పులు వచ్చాయని అనేసరికి రిషి కూడా తనలో మార్పులు వచ్చాయని అనుకుంటాడు. దారి మధ్యలో ఒక పిల్లవాడు అడ్డురావడంతో ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి పరామర్శిస్తారు. ఏం జరిగింది అనటంతో గోలి ఆటలో తనను మోసం చేశారని చెప్పటంతో ఆ అబ్బాయికి న్యాయం చేయటానికి రిషి, వసులు(Vasu) వెళ్తారు.

click me!

Recommended Stories