రవితేజ ఆ డ్రెస్ వేస్తే సినిమా రేంజే వేరు.. వీరయ్యకి కలిసొచ్చిన మాస్ మహారాజ్ సెంటిమెంట్

Published : Jan 18, 2023, 10:14 PM IST

మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్ గా ధమాకా చిత్రంతో తన ఫామ్ అందిపుచ్చుకున్నాడు. అంతకు ముందు పరాజయాలతో సతమతమైన రవితేజ ధమాకాతో జోరు చూపించాడు.

PREV
16
రవితేజ ఆ డ్రెస్ వేస్తే సినిమా రేంజే వేరు.. వీరయ్యకి కలిసొచ్చిన మాస్ మహారాజ్ సెంటిమెంట్

మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్ గా ధమాకా చిత్రంతో తన ఫామ్ అందిపుచ్చుకున్నాడు. అంతకు ముందు పరాజయాలతో సతమతమైన రవితేజ ధమాకాతో జోరు చూపించాడు. ఈ చిత్రం దాదాపు 80 కోట్ల పైనే గ్రాస్ రాబట్టింది. యంగ్ బ్యూటీ శ్రీలీల, రవితేజ కలసి ఈ చిత్రంలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

26

రవితేజ తన సక్సెస్ జోరుని మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంతో కూడా చూపించాడు. వాల్తేరు వీరయ్య చిత్రం 83 కోట్ల షేర్ తో దూసుకుపోతోంది. సంక్రాంతి ముగిసినా కూడా వీరయ్య బాక్సాఫీస్ ప్రతాపం ఆగడం లేదు. వాల్తేరు వీరయ్య ఘనవిజయం వెనుక చిరంజీవి బాక్సాఫీస్ సత్తాతో పాటు.. రవితేజ సెంటిమెంట్ కూడా కనిపిస్తోంది అని నెటిజన్లు అంటున్నారు. 

36

రవితేజ పోలీస్ గెటప్ లో కనిపిస్తే చాలా ఆ చిత్రం సూపర్ హిట్ ఖాయం. ఖతర్నాక్ చిత్రం మినహా రవితేజ ఖాఖీ డ్రెస్ లో కనిపించిన చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి. విక్రమార్కుడు చిత్రంతో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు సరికొత్త నిర్వచనం చెప్పాడు. 

46

ఇక కిక్ చిత్రంలో రవితేజ నిమిషాల్లో మాత్రమే పోలీస్ గెటప్ లో కనిపిస్తాడు. ఆ చిత్రం కూడా రవితేజ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన పవర్ మూవీలో కూడా రవితేజ పోలీస్ పాత్రలో నటించారు. ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ విజయం దక్కించుకుంది. 

 

56

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మిరపకాయ్ చిత్రంలో కూడా రవితేజ పోలీస్ ఆఫీసరే. క్రాక్ మూవీలో మరోసారి రవితేజ ఖాకీ డ్రెస్ స్టామినా చూపించాడు. క్రాక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 

66

ఇక ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో రవితేజ ఏసిపి విక్రమ్ సాగర్ గా అదరగొట్టాడు. ఆ విధంగా రవితేజ ఖాకీ డ్రెస్ సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అయింది. వాల్తేరు వీరయ్య చిత్రం 100 కోట్ల షేర్ సాధించే అవకాశాలు ఉన్నాయంటూ ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. 

click me!

Recommended Stories