Ravi Teja: నన్ను తీసేసి కొందరు వేస్ట్ గాళ్ళని తీసుకున్నారు, అదే నా బాధ.. రవితేజ కామెంట్స్

Published : Jul 23, 2026, 09:09 PM IST

మాస్ మహారాజ్ రవితేజ అంత ఈజీగా స్టార్ హీరో అయిపోలేదు. ఈ సక్సెస్ వెనుక ఎంతో స్ట్రగుల్ ఉంది. కెరీర్ బిగినింగ్ లో తాను ఎదుర్కొన్న కష్టాలు, రిజెక్షన్ గురించి రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

PREV
15
మాస్ మహారాజ్ రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ చిత్ర పరిశ్రమలో కింది స్థాయి నుంచి అగ్ర హీరో స్థాయికి ఎదిగారు. సొంత కష్టం, ట్యాలెంట్ తో ఎదిగిన వాళ్లలో రవితేజ ఒకరు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ చిత్రాలు రవితేజ కెరీర్ ని మార్చేశాయి. ఇడియట్ మూవీతో రవితేజ టాప్ లీగ్ లోకి దూసుకెళ్లారు. అంతకు ముందు కెరీర్ కోసం రవితేజ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

25
రవితేజ కష్టాలు

అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా రవితేజ పనిచేశారు. చిన్న చిన్న పాత్రల్లో నటించారు. ఆ తర్వాత నెమ్మదిగా తన ట్యాలెంట్ ప్రదర్శిస్తూ అవకాశాలు అందుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో రవితేజ తాను పడ్డ కష్టాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలాసార్లు రిజెక్షన్ కి గురయ్యాను. నా అవకాశాలు వేరే వాళ్లకు వెళ్లిపోయేవి.

35
నన్ను రిజెక్ట్ చేసి అర్హత లేని వాళ్ళని తీసుకున్నారు

చాలా సినిమాలు నా వరకు వచ్చి ఆ తర్వాత శ్రీకాంత్ వద్దకు వెళ్లిపోయేవి. నేనేం బాధపడలేదు. ఎందుకంటే శ్రీకాంత్ బావుంటాడు. మంచి నటుడు. ఆ అవకాశాలకు అతడు అర్హుడే. కానీ మరికొన్ని సినిమాల్లో నన్ను రిజెక్ట్ చేసి అర్హత లేని వేస్ట్ గాళ్ళని తీసుకునేవారు. అదే నా బాధ అని రవితేజ అన్నారు. కొన్ని సినిమాల్లో రవితేజ సెకండ్ హీరో పాత్రలు కూడా వేశారు.

45
సోలో హీరోగా ఫ్లాప్

నీ కోసం అనే చిత్రంతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ డిజాస్టర్ అయింది. తిరిగి మళ్ళీ చిన్న పాత్రలు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి రవితేజ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంతో సోలో హీరోగా మరో ప్రయత్నం చేశారు. ఆ మూవీ సూపర్ హిట్ అయింది.

55
స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమాలు

వెంటనే కెరీర్ లో మైలురాయి లాంటి చిత్రం ఇడియట్ పడింది. దెబ్బకు రవితేజ స్టార్ హీరో అయ్యారు. ఆ తర్వాత ఇక వెనుదిగిరి చూసుకోలేదు. పట్టిందల్లా బంగారమే అయింది. అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, ఖడ్గం, వెంకీ, భద్ర లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రవితేజ రేంజ్ పెంచుతూ వెళ్లాయి.

Read more Photos on
click me!

Recommended Stories