బలవంతంగా లిప్ కిస్ పెట్టిన హీరో, వెంటనే వాంతులు చేసుకుందట.. 100 సార్లు ఏం చేసిందో తెలుసా

First Published | Jan 16, 2025, 11:38 AM IST

ప్రస్తుతం సినిమాల్లో లిప్ కిస్ సహజంగా మారిపోయింది. హీరోయిన్లు బోల్డ్ సన్నివేశాలకు, ముద్దు సీన్లకు ఒకే చెబుతున్నారు. అయితే గతంలో వెండితెరపై ముద్దు సన్నివేశాలు కనిపిస్తే హాట్ టాపిక్ గా మారేది. హీరో హీరోయిన్ల గురించి హాట్ హాట్ గా చర్చలు జరిగేవి.

ప్రస్తుతం సినిమాల్లో లిప్ కిస్ సహజంగా మారిపోయింది. హీరోయిన్లు బోల్డ్ సన్నివేశాలకు, ముద్దు సీన్లకు ఒకే చెబుతున్నారు. అయితే గతంలో వెండితెరపై ముద్దు సన్నివేశాలు కనిపిస్తే హాట్ టాపిక్ గా మారేది. హీరో హీరోయిన్ల గురించి హాట్ హాట్ గా చర్చలు జరిగేవి. బాలీవుడ్ లో అయితే దర్శకులు చాలా చిత్రాల్లో లిప్ లాక్ సన్నివేశాలు పెడుతుంటారు. 

అయితే బాలీవుడ్ లో ఒకప్పటి క్రేజీ హీరోయిన్ రవీనా టాండన్ కి లిప్ కిస్ విషయంలో చేదు అనుభవం ఎదురైందట. వయసు పెరుగుతున్న చెక్కు చెదరని అందం రవీనా టాండన్ సొంతం. రవీనా టాండన్ తెలుగులో ఆకాశ వీధిలో, బంగారు బుల్లోడు లాంటి చిత్రాల్లో నటించింది. ఒక హిందీ చిత్రంలో నటిస్తుండగా సన్నివేశంలో భాగంగా హీరో నన్ను బలవంతం చేయాలి. ఆ క్రమంలో అతడు నాకు లిప్ కిస్ ఇచ్చాడు. కిస్సింగ్ సన్నివేశాలు నాకు ఇష్టం లేదు. 


ఆ సీన్ కి కూడా కిస్ అవసరం లేదు. కానీ అది అనుకోకుండా జరిగింది. హీరో తక్కు కూడా లేదు. కానీ అతడు లిప్ కిస్ పెట్టిన వెంటనే నాకు వాంతులు వచ్చాయి. భరించలేకపోయాను అని రవీనా టాండన్ పేర్కొంది. అంతటితో ఆగలేదు. ఆ తర్వాత 100 సార్లు తన ముఖాన్ని రవీనా కడుక్కుందట. అనుకోకుండా జరిగినప్పటికీ నేను తీసుకోలేకపోయాను. 

తర్వాత హీరో వచ్చి తనకి సారీ చెప్పినట్లు రవీనా పేర్కొంది. ఆ సన్నివేశం తప్ప తాను కెరీర్ లో ఒక్క ముద్దు సన్నివేశంలో కూడా నటించలేదు అని రవీనా పేర్కొంది. కెరీర్ మొత్తం అదే కండిషన్ పాటించినట్లు పేర్కొంది. తన కండిషన్ వల్ల చాలా చిత్రాల్లో అవకాశాలు కోల్పోయినట్లు రవీనా పేర్కొంది. రవీనా టాండన్ చివరగా కెజిఎఫ్ 2లో ప్రధాన మంత్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 

త్వరలో రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. తాను ముద్దు సన్నివేశాల్లో నటించలేదు కాబట్టి తన కూతురు కూడా అలాగే ఉండాలి అని కండిషన్ పెట్టదట. కథకి అవసరం అయితే తన కుమార్తె బోల్డ్ సన్నివేశాల్లో నటించేందుకు అనుమతి ఇస్తానని రవీనా పేర్కొంది. 

Latest Videos

click me!