రష్మిక బ్లాక్‌ బెల్ట్ పోజులు.. వేరే డ్రెస్సే దొరకలేదా.. రచ్చ చేస్తున్న నెటిజన్లు..

Published : Dec 17, 2022, 04:13 PM ISTUpdated : Dec 17, 2022, 04:14 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా గ్లామర్‌ బ్యూటీగా మారిపోయిన విషయం తెలిసిందే. ఆమె అందాలు ఆరబోయడంలో ఎప్పుడో హద్దులు చెరిపేసింది. స్కిన్‌ షోకి తెరలేపిన ఈ భామ ధరించిన డ్రెస్‌ హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

PREV
16
రష్మిక బ్లాక్‌ బెల్ట్ పోజులు.. వేరే డ్రెస్సే దొరకలేదా.. రచ్చ చేస్తున్న నెటిజన్లు..

రష్మిక మందన్నా(Rashmika Mandanna) తాజాగా కరాటే క్వీన్‌లా మారిపోయింది. కరాటేలో బ్లాక్‌ బెల్ట్ సాధించిన వారు వేసుకునే డ్రెస్‌ వేసింది. ఓ ఈవెంట్‌లో పాల్గొని రచ్చ చేసింది. చిలిపి పోజులతో కవ్విస్తూ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇప్పుడు రష్మిక మందన్నా ధరించిన డ్రెస్‌ చర్చనీయాంశం అవుతుండటం విశేషం. 
 

26

చూడ్డానికి కరాటేలో బ్లాక్‌ బెల్ట్ సాధించిన వారిలా వైట్‌ జాకెట్‌, ఫ్యాంట్‌ని ధరించింది. మధ్యలో బ్లాక్‌ రిబ్బన్‌ కట్టింది. కరాటేలో నైపుణ్యం పొందిన వారు ఇలాంటి డ్రెస్సే ధరిస్తారనే విషయం తెలిసిందే. తాజాగా రష్మిక అలాంటి డ్రెస్‌ వేయడంతో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. ఫన్నీ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. 

36

రష్మిక కరాటే క్వీనా? రష్మికతో జాగ్రత్త తేడా వస్తే ఎముకలు ఇరిగిపోవాల్సిందే అని, చూడ్డానికి అందంగా, సుకుమారంగా ఉందనుకునేరు, టచ్‌ చేస్తే చిత్తడైపోవాల్సిందే అని, వామ్మో శ్రీవల్లిలో ఇలాంటి కళ కూడా ఉందా అంటున్నారు. సెటైర్లు, ఫన్నీ కామెంట్లతో వైరల్‌ చేస్తున్నారు. మరికొందరు వేసుకోవడానికి వేరే డ్రెస్సే లేదా అంటుండటం గమనార్హం. మొత్తానికి డ్రెస్‌ ఏదైనా ఇప్పుడు రష్మిక వార్తల్లో నిలవడం విశేషం. 
 

46

రష్మిక మందన్నా హిందీలో నటించిన `మిషన్‌ మజ్ను` చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. ఇది ఓటీటీలో రిలీజ్‌ కాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ ఫ్లిక్స్ లో జనవరి 20న విడుదల కాబోతుంది. ఇటీవల టీజర్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో రష్మిక మందన్నా పాల్గొంది. హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి ఆమె సందడి చేసింది. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఓ టీజింగ్‌ సన్నివేశం ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 
 

56

ఇటీవల రష్మిక నటించిన హిందీ ఫిల్మ్ `గుడ్‌బై` థియేటర్లలో విడుదలై నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. ఇప్పుడు రెండో సినిమాగా `మిషన్‌ మజ్ను` రాబోతుంది. ఇది రియలిస్టిక్‌ స్టోరీతో దేశభక్తి ప్రధానంగా సాగబోతుంది. విడుదలైన టీజర్‌ ఆకట్టుకుంటోంది. దీంతోపాటు ఆమె బాలీవుడ్‌లో `యానిమల్‌` సినిమాలో నటిస్తుంది. 
 

66

మరోవైపు తెలుగులో ఇప్పుడీ బ్యూటీ `పుష్ప2`లో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. అలాగే తమిళంలో చేస్తున్న `వారసుడు` సినిమా సంక్రాంతికి రాబోతుంది. విజయ్‌ హీరోగా రూపొందిన ఈ సినిమాకి వంశీపైడిపల్లి దర్శకత్వం వహించారు. దిల్‌రాజు దీన్ని నిర్మించారు. దీంతోపాటు మరో తమిళ సినిమాలో నటిస్తుంది రష్మిక. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories