ఈ ప్రశ్నలకు నమ్రత(Namrat Shirodhkar) సమాధానం చెప్పారు. ఇష్టపూర్తిగా సినిమా వదిలేసినట్లు నమ్రత వెల్లడించారు. నాకు మోడలింగ్ అంటే ఇష్టం. అందుకే ఆ కెరీర్ ఎంచుకున్నాను. కొన్నాళ్ల తర్వాత మోడలింగ్ బోర్ కొట్టింది. దాంతో హీరోయిన్ గా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాను. నటిగా ప్రతి మూమెంట్ నేను ఇష్టపడి చేశాను, ఆస్వాదించాను.