`ఆషిఖీ 3`లో రష్మిక మందన్నా..? శ్రీవల్లి దూకుడికి షాక్‌ అవుతున్న బాలీవుడ్‌ బ్యూటీస్‌..

Published : Sep 17, 2022, 02:12 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా సౌత్‌లోనే కాదు నార్త్ లోనూ దూకుడు పెంచింది. అక్కడ బ్యాక్ టూ బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతుంది. ఆమెకి సంబంధించి తాజాగా మరో క్రేజీ న్యూస్‌ వైరల్‌ అవుతుంది. 

PREV
16
`ఆషిఖీ 3`లో రష్మిక మందన్నా..? శ్రీవల్లి దూకుడికి షాక్‌ అవుతున్న బాలీవుడ్‌ బ్యూటీస్‌..

రష్మిక మందన్నా తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో జోరుమీదుంది. ఇంకా చెప్పాలంటే అత్యధిక సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. అత్యంత బిజీ హీరోయిన్‌గా రాణిస్తుంది. అదే సమయంలో అత్యంత క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌గానూ నిలిచింది రష్మిక. ఇప్పటికే వరుస పాన్‌ ఇండియా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఆమె పేరు వినిపిస్తుంది. 
 

26

రష్మిక మందన్నా `ఆషిఖీ 3`లో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. `ఆషిఖీ` సినిమాలు బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ సిరీస్‌గా నిలిచింది. మహేష్‌ భట్‌ దర్శకత్వంలో మ్యూజికల్‌ రొమాంటిక్‌ డ్రామా కథాంశంతో 1990లో వచ్చిన తొలి చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిస్తే, మళ్లీ ఇరవై ఐదేళ్ల తర్వాత ఆదిత్య రాయ్ కపూర్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా నటించిన `ఆషిఖీ2` సైతం సంచలన విజయం సాధించింది. 
 

36

ఇప్పుడు మూడో సీక్వెల్‌ని ప్లాన్‌ చేస్తున్నారు. అందులో హీరోగా కార్తిక్‌ ఆర్యన్‌ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన వర్క్ జరుగుతుందట. అయితే ఆయనకు జోడీగా దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌ పేర్లు ప్రాథమికంగా వినిపించాయి. కానీ ఇప్పుడు రష్మిక మందన్నా బాగుంటుందని అభిమానులు ఫీల్‌ అవుతున్నారు.

46

ఇటీవల ఓ యాడ్‌ కోసం కార్తిక్‌ ఆర్యన్, రష్మిక కలిసి నటించారు. దీంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. అది `ఆషిఖీ` లాంటి సినిమాకి మరింత కలిసొస్తుందని, వారి కెమిస్ట్రీ అదిరిపోయేలా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అంతేకాదు వీరిద్దరినే కాస్టింగ్‌గా తీసుకోవాలని కోరుతున్నారు. 

56

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ జంటని పరిశీలిస్తున్నారట దర్శక, నిర్మాతలు. రష్మిక మందన్నాతో దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయనే ప్రచారం కూడా ఊపందుకుంది. మరి ఇది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి. కానీ ఈ వార్త మాత్రం బాలీవుడ్‌లో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. దీనికి అనురాగ్‌ బసు, మహేష్‌ భట్‌ వర్క్ చేస్తున్నారు.

66

ఇదిలా ఉంటే బాలీవుడ్‌ లో రష్మిక జోరు చూసి అక్కడ భామలు షాక్‌ అవుతున్నారు. శ్రీవల్లి జోరుకి బేజార్‌ అవుతుండటం విశేషం. ఇక ప్రస్తుతం రష్మిక మందన్నా తెలుగులో `పుష్ప 2`లో నటిస్తుంది. తమిళంలో `వారసుడు` చిత్రాలు చేస్తుంది. హిందీలో `గుడ్‌బై`, `మిషన్‌ మజ్ను`, `యానిమల్‌` సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories