`ఆ చెత్త షోలు ఎందుకు చేస్తున్నావ్‌`.. నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటరిచ్చిన `జబర్దస్త్` రష్మి..

Published : Sep 17, 2022, 01:13 PM ISTUpdated : Sep 17, 2022, 02:18 PM IST

యాంకర్‌ రష్మి, అనసూయలపై తరచూ సోషల్‌ మీడియాలో విమర్శలు, ట్రోల్స్ వస్తుంటాయి. తాజాగా మరోసారి రష్మి నెటిజన్ల ప్రశ్నలకు గురైంది. ఈ సందర్భంగా నెటిజన్లు కామెంట్లకి స్ట్రాంగ్‌ కౌంటర్లిచ్చింది రష్మి.   

PREV
16
`ఆ చెత్త షోలు ఎందుకు చేస్తున్నావ్‌`.. నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటరిచ్చిన `జబర్దస్త్` రష్మి..

`జబర్దస్త్` యాంకర్‌గా బిజీగా ఉంది రష్మి గౌతమ్‌. ఆమె ఇప్పుడు `బజర్దస్త్`తోపాటు `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోలకు యాంకర్‌గా చేస్తుంది. `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి కూడా తనే యాంకర్‌. మూడు షోలతో బాగా సంపాదిస్తుంది. ఇటీవల అనసూయ `జబర్దస్త్` ని వీడి మరో షోకి వెళ్లిపోవడంతో ఆ బాధ్యతని రష్మినే చూస్తుంది. అయితే ఈ షోపై అనసూయ పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో, బాడీ షేమింగ్‌ కామెంట్లకి గురవుతున్నట్టు తెలిపింది. 
 

26

 తాజాగా నెటిజన్లు యాంకర్‌ రష్మిపై పలు షాకింగ్‌ కామెంట్లు చేశారు. ఆ చెత్త షో చేయడం ఎందుకు మంచి సినిమాలు చేసుకోవచ్చుగా అంటూ పోస్ట్ పెట్టారు. రష్మి శుక్రవారం సాయంత్రం నెటిజన్లతో ఛాట్‌ చేసే క్రమంలో ఇలాంటి విమర్శలను ఎదుర్కొంది. `జబర్దస్త్` షోలను అడల్ట్ కంటెంట్‌లకు కేరాఫ్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనికి స్పందించి రష్మి. అదిరిపోయే కౌంటర్లిచ్చింది. 
 

36

సినిమాలు చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, తన వద్ద చాలా స్క్రిప్ట్ లు ఉన్నాయని, నువ్వు సినిమాని నిర్మించేందుకు సిద్ధమైతే చెప్పు, తాను టీవీ షోస్‌ వదిలేసి సినిమాలు చేస్తానంటూ దిమ్మతిరిగే కౌంటరిచ్చింది. దీంతో నోరెళ్లబెట్టడం సదరు నెటిజన్ వంతవడం విశేషం. 

46

మరోవైపు `జబర్దస్త్` షోలు చూసి చిన్న పిల్లలు పాడవుతున్నారంటూ కామెంట్లు చేసిన నెటిజన్లకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే సమాధానం చెప్పింది రష్మి. ఈ షో ద్వారా తాము ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేయాలనుకుంటున్నామని చెప్పింది. చిన్న పిల్లలు 9 వరకు పడుకుంటారని, ఆ తర్వాతనే ఈ షో వస్తుందని చెప్పింది. ఇప్పుడు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరి వద్ద ఫోన్‌ ఉంటుందని, అందులో కావాల్సిన అడల్ట్ కంటెంట్ ఉంటుందని, మరి దాన్నిఎలా అడ్డుకుంటారని ఎదురు ప్రశ్నించింది.

56
Rashmi Gautam

`జబర్దస్త్` షో పై తనకు రెస్పెక్ట్ ఉందని, వాటివల్లే ఇంతటి గుర్తింపు వచ్చిందని, అది ఎంతో మందికి లైఫ్‌ ఇస్తుందని పేర్కొంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించడంలో అది బెస్ట్ షో అని, తాము జెన్యూన్‌గా ఆడియెన్స్ కి వినోదాన్ని పంచే లక్ష్యంతోనే ఈ షోని నిర్వహిస్తున్నట్టు తెలిపింది రష్మి.

66

ఓ వైపు డాగ్స్ సమస్యలు, మరోవైపు టీవీ షోస్‌ పై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పింది రష్మి. వరుస ట్విట్ల పరంపరతో ఇప్పుడు ట్విట్టర్‌లో రష్మి రచ్చ నడుస్తుందని చెప్పొచ్చు. చాలా వరకు ఆమెని ఆడుకునే ప్రయత్నం చేశారు నెటిజన్లు. రష్మి సైతం తనదైన స్టయిల్‌లో కౌంటర్లిస్తూ నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories