నా లిస్ట్ చాలా పెద్దది, ఒక హీరో పేరు చెప్పలేను, బాలీవుడ్ ఎలాంటిదంటే.. రష్మిక మందన్న హట్ కామెంట్స్

Published : Jun 05, 2022, 04:50 PM IST

బాలీవుడ్ పై.. బాలీవుడ్ స్టార్స్ పై.. బాలీవుడ్ ఆడియన్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది రష్మిక మందన్న. తన లిస్ట్ లో చాలా మంది హీరోలు ఉన్నారంటోంది. సౌత్ కు బాలీవుడ్ కు తేడాలు కూడాచెపుతోంది బ్యూటీ.   

PREV
17
 నా లిస్ట్ చాలా పెద్దది, ఒక హీరో పేరు చెప్పలేను, బాలీవుడ్ ఎలాంటిదంటే.. రష్మిక మందన్న హట్ కామెంట్స్

సౌత్ సినిమాల  మీద నార్త్ ఆడియన్స్ ప్రేమ ఇప్పటిది కాదు అంటోంది  స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.  నేను బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వకముందే చాలామంది నన్ను గుర్తుపట్టి పలకరించారు. అంతే కాదు  నార్త్ లో చాలా ప్రాంతాల్లో మన సినిమాలు టీవీల్లో ఎగబడి చూస్తారు. మన  సౌత్ సినిమాలు చాలా వరకూ డబ్బింగ్ అయ్యి ఉత్తరాదిలో రిలీజ్ అవుతాయి అంటుంది రష్మిక. 

27

ఇక పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ లాంటి పాన్ ఇండియా సినిమాలు   వరుసగా రిలీజ్ అవుతుండటంతో.. మన సినిమాలు చూడటానికి    థియేటర్లకు పోటెత్తుతున్నారు అంటోంది రష్మిక. సౌత్  సినిమాను అభిమానించే స్టార్స్ చాలా మంది ఉన్నారంటోంది. 
 

37

బాలీవుడ్‌లో అడుగు పెట్టిన వెంటనే రణ్‌బీర్‌ కపూర్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించే అవకాశం రావడం అదృష్టమే అంటుంది రష్మిక. అంతే కాదు  తమిళ స్టార్‌ హీరో విజయ్‌తో కలిసి పనిచేయడం  గొప్ప అనుభవం అంటోంది. ఇక టాలీవుడ్ లో మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ వంటి స్టార్‌ హీరోలతో నటించాను. కన్నడలో పునీత్‌ రాజ్‌ కుమార్‌తోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నా.అంటోంది. 

47

అంతే కాదు తన అభిమాన హీరోల లిస్ట్‌ చాలా పెద్దది. ఒకరిపేరని ఎలా చెప్పను అంటోంది రష్మిక. ఇక తన అబిమాన స్టార్స్ తో సినిమా చేయడం అంటే.. లక్కీగా ఫీల్  అవుతుందట.  అదృష్టం కొద్దీ అవకాశాలతోపాటు మంచి కథలు కూడా వస్తున్నాయి అంటోంది. 

57

టాలీవుడ్‌లో చేస్తూనే బాలీవుడ్‌ పైనా ఫోకస్‌ చేస్తొంది రష్మిక. అమితాబ్‌ బచ్చన్‌తో పనిచేస్తున్నంత సేపూ ఆయన నుంచి ఏం నేర్చుకోగలనా అనే ఆలోచిస్తాను అంటుంది.  ఏమాత్రం గ్యాప్‌ దొరికినా పెద్దాయన జీవితానుభవాలు తెలుసుకుంటాను. నటనలో సందేహాలు తీర్చుకుంటాను. నా దృష్టిలో ఆయన ఓ విజ్ఙాన ఖనిఅంటూ.. అమితాబ్ ను పొగడ్తలతో ముంచెత్తింది. 
 

67

వరుసగా సినిమాలు హిట్ అవ్వడం వెనకు ప్రత్యేకంగా తను తీసుకునే జాగ్రత్తలేమి లేవంటోంది.  సినిమాకు సంతకం చేసేముందు కథ, నా పాత్ర ప్రాధాన్యం..ఇంత వరకే ఆలోచిస్తాను. ఆ సినిమా పూర్తయ్యేవరకూ పాత్రకు న్యాయం చేసేందుకే ప్రయత్నిస్తాను. పెద్దపెద్ద హీరోలు కూడా తమనుతాము నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల ముందు నేనెంత అంటుంది రష్మిక. 

77

అయితే బాలీవుడ్ లో ఛాన్సులోస్తున్నాయనో  ఏమో.. తనకు సౌత్ నార్త్ తేడా లేదు అంటోంది. దేశమంతా నా గురించి తెలియాలి.నా ఫ్యాన్స్ ను నేను మరింత అలరించాలి. పాన్‌ ఇండియా సినిమాలతో నా లక్ష్యం సులభమైంది. అందరూ అన్ని సినిమాలూ చూస్తున్నారు. తేడా లేకుండా ఆదరిస్తున్నారు. ఇంతమంది ప్రేక్షకుల అభిమానం పొందడం ఆనందంగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories