పూజా హెగ్డే వల్లే రష్మిక మందన్నాకి ఆ బంపర్‌ ఆఫర్‌.. నేషనల్‌ క్రష్‌పై ఇలాంటి కామెంట్లేంటి? హాట్‌ టాపిక్‌

Published : Apr 09, 2022, 08:10 PM ISTUpdated : Apr 09, 2022, 11:32 PM IST

ప్రస్తుతం టాలీవుడ్‌లో పూజా హెగ్డే, రష్మిక మందన్నా టాప్‌ స్టార్‌ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. టాలీవుడ్‌లోనే కాదు, కోలీవుడ్‌, అటు బాలీవుడ్‌లోనూ క్రేజీ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అయితే లేటెస్ట్ పూజా వల్లే రష్మికకి ఓ బంపర్‌ ఆఫర్‌ వచ్చిందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

PREV
17
పూజా హెగ్డే వల్లే రష్మిక మందన్నాకి ఆ బంపర్‌ ఆఫర్‌.. నేషనల్‌ క్రష్‌పై ఇలాంటి కామెంట్లేంటి? హాట్‌ టాపిక్‌

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, బుట్టబొమ్మ పూజా హెగ్డేల మధ్య ఇప్పుడు నెంబర్‌ గేమ్‌ నడుస్తుంది. టాప్‌ చైర్‌ కోసం పోటీ నడుస్తుంది. ఇద్దరూ ఎవరికివారు క్రేజీ ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్నారు. అయితే  పూజా కమర్షియల్‌ హీరోగా రాణిస్తుంటే, రష్మిక నటన పరంగానూ మెప్పిస్తుంది. పూజా ఇప్పుడిప్పుడే నటనపై ఫోకస్‌ పెడుతుంటే, రష్మిక సైతం ఇప్పుడిప్పుడే అందాల ఆరబోతపై ఫోకస్‌ పెడుతుంది. అలా ఈ ఇద్దరి మధ్య టగ్‌ ఆఫ్‌ వార్‌ నడుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

27

 పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో `ఆచార్య` నటించగా, మహేష్‌బాబుతో త్రివిక్రమ్‌ సినిమాలో నటిస్తుంది. దీంతోపాటు పవన్‌తో `భవదీయుడు భగత్‌సింగ్‌` చిత్రంలో చేయబోతుంది. అలాగే బన్నీతోనూ ఓ సినిమా చేయబోతుందని టాక్‌. మరోవైపు కోలీవుడ్‌లో విజయ్‌తో `బీస్ట్` సినిమా చేసింది. ఇంకోవైపు హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో ఓ సినిమాకి కమిట్‌ అయ్యింది. ఇలా టాప్‌ స్టార్ల సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. 

37

మరోవైపు రష్మిక మందన్నా `పుష్ప 2`లో చేస్తుంది. రామ్‌తో బోయపాటి సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. అలాగే హిందీలో `యానిమల్‌` సినిమాకి హీరోయిన్‌గా ఇటీవలే కన్ఫమ్‌ అయ్యింది.  ఇంకోవైపు ఇప్పటికే హిందీలో `మిషన్‌ మజ్ను`, `గుడ్‌ బై` సినిమాలు చేస్తుంది. థళపతి విజయ్‌తో వంశీపైడిపల్లి చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. దీనికి దిల్‌రాజు నిర్మాత. ఈ చిత్ర షూటింగ్‌ కూడా స్టార్ట్ అయ్యింది. ఇలా తనుకూడా తగ్గేదెలే అంటూ దూసుకుపోతుంది. 

47

విజయ్‌ సినిమాలో హీరోయిన్‌గా మొదట పూజా హెగ్డేనే అప్రోచ్‌ అయ్యారట. దిల్‌రాజుకి, పూజాకి మంచి ర్యాపో ఉంది. తన బ్యానర్‌లో `డీజే` చేసింది. `మహర్షి` సినిమాలోనూ దిల్‌రాజు భాగమైన విషయం తెలిసిందే. పైగా పూజా షూటింగ్‌ విషయంలో చాలా కంఫర్ట్ గా ఉంటుంది. పెద్దగా రిస్టిక్షన్స్ ఉండవనే కారణాలతో పూజా విషయంలో దిల్‌రాజు సానుకూలంగా ఉన్నారట. అందుకే `విజయ్‌ 66` కోసం ఆమెని కలవగా అప్పటికే బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌తో ఓ సినిమాకి కమిట్‌ అయిన కారణంగా విజయ్‌ సినిమా చేయలేకపోయినట్టు పూజా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

57

మరో సరైన ఆల్టర్‌నేట్‌ లేకపోవడంతో రష్మిక మందన్నాని అప్రోచ్‌ అయ్యారని తెలుస్తుంది. విజయ్‌తో నటించే ఆఫర్‌ రావడంతో ఎగిరి గంతేసింది రష్మిక. ఆ ఆనందాన్ని ఇటీవల సినిమా ఓపెనింగ్‌లోనూ బయటపెట్టింది. విజయ్‌కి దిష్టి తీసింది. హంగామా చేసింది. ఆ పిక్స్ వైరల్‌ అయ్యాయి. మొత్తంగా పూజా హెగ్డే కాదనడం వల్లే నేషనల్‌ క్రష్‌కి ఈ ఆఫర్‌ వచ్చిందని అంటున్నారు నెటిజన్లు. 

67

అయితే రష్మిక మందన్నాని హీరోయిన్‌గా తీసుకోవడం నిర్మాత దిల్‌రాజుకి ఇష్టం లేదనే టాక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. రష్మిక చాలా ఓవర్‌గా బిహేవ్‌ చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఆమెని తట్టుకోవడం కష్టమనే భావనలో దిల్‌రాజు ఉన్నారనేది భోగట్టా. ఇప్పటికే రష్మికతో `సరిలేరు నీకెవ్వరు` చిత్రం చేశాడు దిల్‌రాజు. ఆ సమయంలోనే రష్మిక విషయంలో కాస్త అసంతృప్తికి లోనయ్యారని టాక్. మహేష్‌బాబు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారట. అందుకే `పుష్ప` విడుదలయ్యాక ఆయన ట్వీట్‌ చేస్తూ ఆమె పేరుని మెన్షన్‌ చేయలేదని అంటున్నారు నెటిజన్లు. 
 

77

మరి ఇందులో నిజమెంతో గానీ ప్రస్తుతం ఈ వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండటం విశేషం. అద్భుతమైన నటనతో మెప్పిస్తూ వరుస సక్సెస్‌లతో దూసుకుపోతూ గోల్డెన్‌ లెగ్‌గా పేరుతెచ్చుకున్న రష్మికపై ఇలాంటి వార్తలు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అటు పూజా, ఇటు రష్మిక ఇద్దరూ హీరోయిన్లుగా ఉన్న సినిమాలు సక్సెస్‌లవుతున్న నేపథ్యంలో ఇద్దరూ లక్కీ హీరోయిన్లుగా చలామనీ అవుతుండటం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories