Ariyana: మా బావని చూడకూడని స్థితిలో చూశా, గుండె పగిలింది.. బోరున ఏడ్చేసిన అరియనా

Published : Apr 09, 2022, 06:50 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 తో పాపులర్ అయిన బ్యూటీ అరియనా. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది. రాంగోపాల్ పుణ్యమా అని ఈ యంగ్ బ్యూటీ కూడా సోషల్ మీడియాలో క్రేజ్ సొంతం చేసుకుంది.

PREV
16
Ariyana: మా బావని చూడకూడని స్థితిలో చూశా, గుండె పగిలింది.. బోరున ఏడ్చేసిన అరియనా
Ariyana

బిగ్ బాస్ సీజన్ 4 తో పాపులర్ అయిన బ్యూటీ అరియనా. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది. రాంగోపాల్ పుణ్యమా అని ఈ యంగ్ బ్యూటీ కూడా సోషల్ మీడియాలో క్రేజ్ సొంతం చేసుకుంది. ఆర్జీవితో కలసి జిమ్ లో చిట్ చాట్ చేస్తూ బోలెడు గుర్తింపు సొంతం చేసుకుంది అరియనా.  

26
Ariyana

ఇప్పుడు అరియనా బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా పాల్గొంటోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అరియనా తన బావతో ప్రేమ వ్యవహారాన్ని రివీల్ చేసింది. తన లవ్ స్టోరీ గుర్తు చేసుకుంటూ బోరున ఏడ్చేసింది. సొంత బావే తనని మోసం చేశాడని అరియనా కన్నీరు మున్నీరైంది. 

36
Ariyana

మా బావతో 9వ తరగతిలోనే ప్రేమ మొదలయింది. వయసు పెరిగే కొద్దీ ప్రేమ బలపడుతూ వచ్చింది. మా బావ డిగ్రీ పూర్తి చేశాక హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. హైదరాబాద్ లో ఇద్దరం కలిసే ఉన్నాం. అప్పటికి మూడేళ్ళ పాటు రిలేషన్ లోనే ఉన్నాం. తిన్నావా పడుకున్నావా అంటూ బావ చూపించే కేరింగ్ బాగా నచ్చేది. 

46
Ariyana

కొన్ని రోజుల తర్వాత మా బావకి నేని బోర్ కొట్టేశాను. ఆ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. ఒక రోజు అనుకోకుండా మా బావని ఏ అమ్మాయి చూడకూడని స్థితిలో చూశాను. నా గుండె పగిలింది. విడిపోవాలని డిసైడ్ అయ్యా. కానీ ఏవేవో మాటలు చెప్పి నన్ను ఒప్పించాడు. ఆ తర్వాత మరో రెండేళ్లు రిలేషన్ లో ఉన్నాం. 

56
Ariyana

నాకు ఆర్జే కావాలని ఉన్నట్లు మా బావకి చెప్పా. అలాగే ప్రయత్నించు అని చెప్పాడు. ఆ ప్రయత్నాలో నాకు ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. దీనితో మా బావ నన్ను అనుమానించడం మొదలు పెట్టాడు. మరీ అతిగా అనుమానిస్తుంటే నా వల్ల కాలేదు. బ్రేకప్ చెప్పేశా అని అరియానా పేర్కొంది. 

66
Ariyana

ఆ తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు బావ గుర్తొచ్చే వాడు. ఎలాగైనా బావతో మళ్ళీ కలసి పోవాలి ప్రయత్నించా. నేను సంపాదిస్తున్నాను కాబట్టి బావకు గిఫ్ట్ ఇవ్వాలని, నచ్చిన శారీ కట్టుకుని వెళ్ళా. కానీ బావ నన్ను రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు బావ మనసు మార్చుకుని వచ్చినా నాకు వద్దు అంటూ అరియానా కంటతడి పెడుతూ తన లవ్ స్టోరీ తెలిపింది.

click me!

Recommended Stories