విజయ్‌ దేవరకొండతో రష్మిక బ్రేకప్‌.. కొత్త హీరోతో నేషనల్‌ క్రష్‌ డేటింగ్‌.. అడ్డంగా దొరికిపోయారా?

Published : Apr 01, 2023, 04:29 PM IST

రష్మిక మందన్నా, విజయ్‌ దేవరకొండ కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్టు, ఈ ఇద్దరు డేటింగ్‌ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి, కానీ ఇటీవల ఈ ఇద్దరు విడిపోయారట. రష్మిక మరో హీరోతో క్లోజ్‌గా మూవ్‌ అవుతుందంటూ వార్తలొస్తున్నాయి.   

PREV
17
విజయ్‌ దేవరకొండతో రష్మిక బ్రేకప్‌.. కొత్త హీరోతో నేషనల్‌ క్రష్‌ డేటింగ్‌.. అడ్డంగా దొరికిపోయారా?

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ కలిసి `గీత గోవిందం`చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే ఈ ఇద్దరి మధ్య జోడి కుదిరిందని,ప్రేమలో పడ్డారని, డేటింగ్‌ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. `డియర్‌ కామ్రేడ్‌`తో ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. దీనికితోడు ఈ ఇద్దరు కలిసి వెకేషన్లకి వెళ్లడం, విజయ్‌ ఇంటికి రష్మిక రావడంతో ఆ వార్తలకు బలం చేకూరినట్టయ్యింది. అయితే ఈ ఇద్దరు విడిపోయినట్టు ఈ మధ్య వార్తలొచ్చాయి. 

27

`ఖుషి` సినిమా సమయంలో విజయ్‌కి, రష్మిక బ్రేకప్‌ చెప్పుకున్నారట. ప్రస్తుతం విజయ్‌.. సమంతకి క్లోజ్‌గా ఉంటున్నారని ఓ పుకార్‌ వినిపించింది. దీనిపై క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు మరో కొత్త రూమర్‌ తెరపైకి వచ్చింది. రష్మిక మందన్నా మరో తెలుగు హీరోతో ప్రేమలో పడిందని కొత్త పుకార్‌ ఊపందుకుంటుంది. ఇది నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. 
 

37

ఆ హీరో ఎవరో కాదు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఆయన, రష్మిక కలిసి ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అక్కడ చాలాక్లోజ్‌గా మూవ్‌ అయ్యారు. అప్పుడే అందరికి అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు ఈ ఇద్దరు కలిసి ఎయిర్‌ పోర్ట్ లోనూ సందడి చేశారు. కలిసి వెళ్తున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. 

47

ఇందులో రష్మిక స్కై బ్లూ డ్రెస్‌ ధరించింది. ఎయిర్‌ పోర్ట్ లో ఆమె క్యూట్‌గా, సిగ్గు పడుతూ ఫోటోలకు చిక్కింది. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సైతం బ్రౌన్‌ కలర్‌ ప్యాంట్‌, సిల్వర్‌ కలర్‌ షర్ట్ ధరించారు. బ్లాక్‌ సన్‌ గ్లాసెస్‌ పెట్టుకుని స్టయిలీష్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ముంబయి ఎయిర్‌ పోర్ట్ లో ఈ ఇద్దరు సండి చేయడం విశేషం.
 

57

దీంతో ఓ వైపు ఎయిర్‌పోర్ట్ లో కలిసి కనిపించారు. మరోవైపు ముంబాయిలో జరిగిన ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌లో ఈ ఇద్దరు కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ఇందులో రష్మిక డ్రెస్‌ మరీ చిన్నది కావడంతో దాన్ని క్యారీ చేయడంలో ఇబ్బంది పడింది. తన థండర్‌ థైస్‌ చూపిస్తూ, ఎద అందాలను చూపిస్తూ ఆకట్టుకుంది. అదే సమయంలో ఆమె డ్రెస్‌ పై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. ట్రోల్స్ పక్కన పెడితే ఇప్పుడు ఈ ఇద్దరు డేటింగ్‌ చేస్తున్నారనే వార్త హాట్‌ టాపిక్‌గా మారింది. చిత్ర వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

67

అయితే ఈఇద్దరు కలిసి సినిమా చేయలేదు. కలిసి సందర్భం కూడా చాలా అరుదు. మొదటిసారి కలిసి మీడియాకి చిక్కారు. మరి దానితోనే ఈ రూమర్స్ స్ప్రెడ్‌ అయ్యాయా? లేక నిజంగానే ఈ ఇద్దరి మధ్య లవ్‌ స్టార్ట్ అయ్యిందా? అనేది ఆసక్తికరంగా, హాట్‌ టాపిక్‌గా మారింది. ఇందులో నిజాలేంటనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `ఛత్రపతి` సినిమాలో నటిస్తున్నాడు. ఇది మే 12న విడుదల కానుంది. 

77

మరోవైపు రష్మిక మందన్నా హిందీలో `యానిమల్‌` చిత్రంలో నటిస్తుంది. హిందీలో ఆమెకిది మూడో సినిమా. తెలుగులో `పుష్ప2` చిత్రంలో నటిస్తుంది. అలాగే నితిన్‌తో వెంకీ కుడుముల సినిమా చేస్తుంది. ఇటీవలే ఇది ప్రారంభమైంది. అంతకు ముందు జోరు రష్మికలో మిస్‌ అయ్యింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories