మెగా డాటర్ నుంచి ఊహించని గ్లామర్ ట్రీట్.. వన్ షోల్డర్, స్ల్పిటెడ్ డ్రెస్ లో అందాల ప్రదర్శన

First Published | Dec 2, 2023, 2:34 PM IST

మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం కెరీర్ ను సరికొత్తగా ప్రారంభించింది. నిర్మాతగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ ఆసక్తికరంగా పోస్టులు పెడుతోంది. 
 

మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా నిహారిక కొణిదెల (Niharika Konidela) తెలుగు ప్రేక్షకులకు సుపరితమే. మెగా డాటర్ ఇమేజ్ తో మూడు సినిమాలు కూడా చేసింది. నటిగా వెండితెరపై అలరించింది. కానీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. మరోవైపు నిర్మాతగానూ మారి ఆకట్టుకుంది. 
 

తను నిర్మాతగా నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై పలు వెబ్ సిరీస్ లను నిర్మించింది. చివరిగా ‘డెడ్ ఫిక్సల్స్’ సిరీస్ తో ప్రేక్షకులను అలరించింది. సిరీస్ లను నిర్మించి మాత్రం సక్సెస్ కాగలిగింది. దీంతో సినిమా నిర్మాణంలోకి కూడా రీసెంట్ గానే అడుగుపెట్టింది. తన మొదటి సినిమాను గ్రాండ్ గా ప్రారంభించిన విషయం తెలిసిందే. 
 


అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైన ఈ నూతన సినిమాకు మొదలుతోనే బజ్ క్రియేట్ అయ్యేలా చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 

ఇదిలా ఉంటే.. నిహారిక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటుంది. నటిగా ఎదిగే ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఈ క్రమంలో నిహారిక బోల్డ్ ఫోటో షూట్స్ తో గ్లామరస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా స్టన్నింగ్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది.

కొంత కాలంగా మెగా డాటర్ నెట్టింట చేస్తున్న అందాల ప్రదర్శనకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు షాక్ అవుతున్నారు. కిర్రాక్ అవుట్ ఫిట్లలో కవ్వించేలా ఫొటోలకు ఫోజులిస్తోంది. కుర్రకారును తనవైపు తిప్పుకునేలా గ్లామర్ మత్తు వెదజల్లుతోంది. ఈ క్రమంలో తాజాగా మరిన్ని ఫొటోలను షేర్ చేసింది.

లేటెస్ట్ పిక్స్ లో నిహారిక స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. వన షోల్డర్, స్ల్పిటెడ్ డ్రెస్ లో అందాల ధాటికి పాల్పడింది. ఓవైపు షోల్డర్ అందాలతో, మరోవైపు థైస్ షోతో మతులు పోగొట్టింది. మత్తెక్కించే ఫోజులతో చూపుతిప్పుకోకుండా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్  గా మారాయి. 
 

Latest Videos

click me!