Rashmika: ఫ్రెండ్‌ పెళ్లిలో రష్మిక మందన్నా సందడే సందడి.. కూర్గ్ స్టయిల్‌లో చీర కట్టి మతిపోగొడుతున్న బ్యూటీ

Published : May 16, 2022, 12:29 PM ISTUpdated : May 16, 2022, 01:15 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా శారీలో మెరిసింది. తరచూ ట్రెండీ వేర్‌లో కనువిందు చేసే ఈ భామ ఇప్పుడు ఫ్రెండ్‌ పెళ్లిలో సరికొత్త లుక్‌లో దుమారం రేపుతుంది. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. 

PREV
16
Rashmika: ఫ్రెండ్‌ పెళ్లిలో రష్మిక మందన్నా సందడే సందడి.. కూర్గ్ స్టయిల్‌లో చీర కట్టి మతిపోగొడుతున్న బ్యూటీ

రష్మిక మందన్నా(Rashmika Mandanna) పొట్టిదుస్తులేస్తే దుమ్ము దుమారం. ఆమె హాట్‌ పోజులకు ఇంటర్నెట్‌ జనాలంతా ఫిదా అయిపోతుంటారు. అదే చీరకడితే ఆ అందాన్ని వర్ణించడం కష్టమే. అంతటి అందం రష్మిక సొంతం. చలాకీ తనానికి చీరకడితే యావత్ కుర్రాళ్ల లోకమంతా బానిసైపోవాల్సిందే. ప్రస్తుతం రష్మిక అంతగా కట్టిపడేస్తుంది. 

26

రష్మిక లేటెస్ట్ గా శారీలో మెరిసింది. తన ఫ్రెండ్‌ పెళ్లి వేడుకలో(Rashmika in Friend wedding) భాగంగా ఆమె మరింత అందంగా ముస్తాబైంది. అయితే కూర్గి స్టయిల్‌లో శారీ కట్టిన రష్మిక, ఫోటోలకు పోజులిచ్చింది. ఆ పిక్స్ ని సోషల్‌ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. కొత్త లుక్‌లో రష్మిక చూసిన నెటిజన్ల ఫిదా అవుతున్నారు. వామ్మో ఇదెక్కడి అందం అంటూ రష్మికని చూస్తూ మైమరిచిపోతున్నారు.
 

36

గోల్డ్ కలర్‌ శారీ కట్టింది రష్మిక. ఫ్రెండ్‌ మ్యారేజ్‌ కావడంతో వారి సొంత ట్రెడిషన్‌లోకి మారిపోయింది. చీర కూడా సరికొత్తగా కట్టడంతో ఇంకా అందం రెట్టింపయ్యిందని చెప్పొచ్చు. ఆమెని చూసేందుకు రెండు కళ్లు సరిపోవడం లేదంటున్నారు ఆమె అభిమానులు. ఫ్రెండ్ వెడ్డింగ్‌ ఈవెంట్‌లో రష్మిక దిగిన ఫోటోలు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

46

ఇందులో రష్మిక చెబుతూ, ఈరోజు నా స్నేహితురాలు రాగిణి ముద్దయ్య పెళ్లి చేసుకుంటుంది. ఇక ఈ రోజు నుంచి ఆమెతో నా ఫోటో ఉండదు. కానీ నేను దాన్ని కోల్పోలేను. నా ఫ్లైట్‌ నాలుగైదు సార్లు డీలే తర్వాత, ఉదయం నాలుగు గంటలకు ఫ్లైట్‌ మిస్‌ అయ్యాక నేను ఎట్టకేలకు ఆమె పెళ్లిక వచ్చాను. ఆమె ఎంతో అందమైన వధువు` అని పేర్కొంది. 

56

ఇక తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఫోటోలు దిగిన రష్మిక, వాటిని షేర్‌ చేస్తూ, నేను ఈ అమ్మాయిలతో కలిసి పెరిగాను. 17ఏళ్లుగా వాళ్లు నాకు తెలుసు. కానీ ఏమీ మారలేదు` అని పేర్కొంది రష్మిక. ఫ్రెండ్స్ తో కలిసి రచ్చ చేసింది. రష్మిక హాజరు కావడంతో పెళ్లివేడుకకు కొత్త కళ వచ్చినట్టయ్యింది. అంతేకాదు రష్మిక ఉంటే సందడంతా అక్కడే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆమె ఫ్రెండ్‌ వేడుకలో సందడి మొత్తం రష్మికదే కావడం విశేషం. 

66

రష్మిక మందన్నా.. ప్రస్తుతం తెలుగులో `పుష్ప 2`, `సీతా రామం` చిత్రాల్లో నటిస్తుంది. హిందీలో `యానిమల్‌`, `మిషన్‌ మజ్ను`, `గుడ్‌బై` చిత్రాలు చేస్తుండగా, కోలీవుడ్‌లో విజయ్‌తో కలిసి ఆయన 66వ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories