Rashmika Engagement: విజయ్‌ దేవరకొండతో పెళ్లి రూమర్స్ కి ముందే రష్మికకి ఎంగేజ్‌మెంట్‌.. ఏం జరిగిందో తెలుసా?

Published : Feb 22, 2022, 08:13 AM IST

విజయ్‌ దేవరకొండని ఆమె పెళ్లి చేసుకోబోతుందనే టాక్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. అయితే విజయ్‌తో డేటింగ్‌, మ్యారేజ్‌రూమర్స్ కి ముందే రష్మిక మందన్నాకి ఆల్‌రెడీ ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. మరి అది ఎవరితో, ఆ ఎంగేజ్‌మెంట్‌ అనంతరం ఏం జరిగిందనేది చూస్తే.. 

PREV
19
Rashmika Engagement: విజయ్‌ దేవరకొండతో పెళ్లి రూమర్స్ కి ముందే రష్మికకి ఎంగేజ్‌మెంట్‌.. ఏం జరిగిందో తెలుసా?

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఇప్పుడు సర్వత్రా హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఓ వైపు స్టార్‌ హీరోయిన్‌గా నేషనల్‌ వైడ్‌ ఇమేజ్‌తో దూసుకుపోతుంటే, ఇప్పుడు మ్యారేజ్‌ వార్తలు గుప్పుమంటున్నాయి. విజయ్‌ దేవరకొండని ఆమె పెళ్లి చేసుకోబోతుందనే టాక్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. అయితే విజయ్‌(Vijay Devarakonda)తో డేటింగ్‌, మ్యారేజ్‌రూమర్స్ కి ముందే రష్మిక మందన్నాకి ఆల్‌రెడీ ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. మరి అది ఎవరితో, ఆ ఎంగేజ్‌మెంట్‌ అనంతరం ఏం జరిగిందనేది చూస్తే.. 
 

29

Rashmika Mandanna అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులో `ఛలో`, `గీతగోవిందం`, `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ`, ఇప్పుడు `పుష్ప` చిత్రాలతో రష్మిక రేంజే మారిపోయింది. `పుష్ప` చిత్రం పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదలై దుమ్మురేపింది. ఇందులో శ్రీవల్లిగా డీ గ్లామర్‌ రోల్‌లో రష్మిక చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చాలా సహజమైన నటనతో మెప్పించింది. ఇప్పుడందరు శ్రీవల్లిగా పిలుచుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. 
 

39

అయితే తాజాగా టాలీవుడ్‌ క్రేజీ హీరో, రౌడీ బాయ్ విజయ్‌ దేవరకొండతో రష్మిక ప్రేమలో ఉందనే వార్త గత కొంత కాలంగా వైరల్‌ అవుతుంది. వీరిద్దరు `గీత గోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌` చిత్రాల్లో నటించారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు చిత్రాల్లో నటించడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందనే రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. దీనికితోడు విజయ్‌ దేవరకొండ ఇంట్లో ప్రతి ఫంక్షన్‌కి రష్మిక హాజరవుతుండటంతో ఈ రూమర్స్ కి బలం చేకూర్చినట్టయ్యింది. 

49

మరోవైపు ఈ ఏడాది న్యూఇయర్‌ వేడుకలను కూడా విజయ్‌తో గోవాలో సెలబ్రేట్‌ చేసుకుంది రష్మిక, మరోవైపు ముంబయిలో వీరిద్దరు ఒకే హోటల్‌ నుంచి బయటకు రావడం సంచలనంగా మారింది. ఇద్దరు డేట్‌కి వెళ్లారనే పుకార్లు మరింతగా ఊపందుకున్నాయి. ఇప్పుడు కొత్తగా రష్మిక, విజయ్‌ మ్యారేజ్‌ చేసుకోబోతున్నారని, వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారని, ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ మ్యారేజ్‌ ఉంటుందనే వార్త నెట్టింట దుమారం రేపుతుంది. 
 

59

మ్యారేజ్‌ రూమర్స్ చక్కర్లు కొడుతుండటంతో ఎట్టకేలకు విజయ్‌ దేవరకొండ స్పందించారు. ఈ రూమర్స్ కి చెక్‌ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ వార్తలు రెగ్యూలర్‌గా జరిగే నాన్సెన్స్ అంటూ కొట్టిపారేశారు. ఇలాంటి వార్తలను నమ్మాలా? అంటూ ప్రశ్నించారు. విజయ్‌ కౌంటర్‌తో మ్యారేజ్‌ రూమర్స్ కి చెక్‌ పెట్టినట్టయ్యింది. అదే సమయంలో ఇప్పుడు మరో కొత్త విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆల్‌రెడీ రష్మికకి ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందనే వార్త మరోసారి బయటకొచ్చింది. 
 

69

కన్నడకి చెందిన నేషనల్ క్రష్‌ హీరోయిన్‌గా కెరీర్‌ శాండల్‌వుడ్‌ నుంచే ప్రారంభమైన విషయం తెలిసిందే. `కిర్రిక్‌పార్టీ` చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకి పరిచయం అయ్యింది రష్మిక. ఇందులో రక్షిత్‌ శెట్టి హీరో. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మనసులు కలిశారు. సినిమా హిట్‌ అయ్యాక ఇద్దరు మ్యారేజ్‌ చేసుకోవాలనుకున్నారు. ఏకంగా ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు. గ్రాండ్‌గా వీరి నిశ్చితార్థం జరగడం విశేషం. అయితే అదే సమయంలో తెలుగులో ఆఫర్స్ వచ్చాయి రష్మికకి. 

79

తెలుగులో నాగశౌర్యతో నటించిన `ఛలో` చిత్రం హిట్‌ కావడంతో వెంటనే `గీతగోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌`, `దేవదాస్‌` వంటి ఆఫర్స్‌ క్యూ కట్టాయి. `గీతగోవిందం` హిట్‌ అవడంతో తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ జాబితాలో చేరిపోయింది. ఆ తర్వాత మహేష్‌తో `సరిలేరు నీకెవ్వరు`, నితిన్‌తో `భీష్మ` చిత్రాల విజయాలు రష్మిక కెరీర్‌ని మార్చేశాయి. వరుస సక్సెస్‌లు, స్టార్‌ ఇమేజ్‌, అనంతరం బాలీవుడ్‌ ఆఫర్స్ నేపథ్యంలో రష్మిక ఓ నిర్ణయం తీసుకుంది. ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ చేసుకుంది. వ్యక్తిగత కారణాల పేరుతో రక్షిత్‌ శెట్టితో ఎంగేజ్‌మెంట్‌ని రద్దు చేసుకుని కెరీర్‌పై ఫోకస్‌ పెట్టింది.

89

ఒకవేళ రక్షిత్‌ శెట్టిని మ్యారేజ్‌ చేసుకుంటే రష్మిక ఇప్పుడు నేషనల్‌ క్రష్‌గా ఎదిగేది కాదని, బాలీవుడ్‌లో రాణించేది కాదని, `పుష్ప` లాంటి బిగ్గెస్ట్ సక్సెస్‌ దక్కేది కాదనే టాక్‌ ఆమె అభిమానుల నుంచి వినిపిస్తుంది. ఏదేమైనా జీవితంలో కొన్ని సాధించాలంటే మరికొన్ని వదులుకోవాలని అన్నట్టు సినిమా కెరీర్‌ కోసం రష్మిక వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిందనే టాక్‌ వినిపిస్తుంది. అయితే ఇప్పుడు విజయ్‌ దేవరకొండతో ప్రేమ, మ్యారేజ్‌ రూమర్స్ వరుసగా వెంటాడుతున్నాయి. మరి దీనికి ఎప్పుడు చెక్‌ పెడుతుందో చూడాలి. 

99

రష్మిక మందన్నా ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఇప్పుడు `పుష్ప` రెండో పార్ట్ `పుష్పః ది రూల్‌`లో నటించబోతుంది. అలాగే తెలుగులో నటించిన మరో సినిమా `ఆడవాళ్లు మీకు జోహార్లు` విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది మార్చి 4న రిలీజ్‌ కాబోతుంది. దీంతోపాటు తెలుగులో మరో రెండు ప్రాజెక్ట్ లు చర్చలదశలో ఉన్నట్టు టాక్‌. హిందీలో మూడు సినిమాలు చేస్తుంది రష్మిక. అలాగే కోలీవుడ్‌లోనూ ఓ సినిమాకి కమిట్‌ అయినట్టు టాక్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories