విభిన్న కథతో ‘బ్లాక్ బాస్టర్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన రాజ్ విరాట్ అందుకు సంబంధించిన కొన్ని అంశాలను చక్కగా వివరించారు. ముఖ్యంగా మత్య్సకారుడు పోతురాజు క్యారెక్టర్ ను పరిచయం చేయడం, ఫ్యామిలీ గురించి కొత్తగా వివరించడం, లీడ్ రోల్ లక్ష్యాన్ని చెప్పడం లాంటి అంశాలను సరళంగా సూటిగా ఆసక్తికరంగా చెప్పారు. పోతురాజ్ జీవితంలోకి వాణి ఎంటర్ అయ్యాకా లవ్ ట్రాక్ ను చాలా నార్మల్ గా చూపించారు. స్టోరీ లైన్ పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఏదేమైనా పోతురాజ్ గోల్, అతని వ్యక్తిత్వం, సరదా లైఫ్ ను, వాణితో లవ్ ట్రాక్, తన తండ్రి మరణం వరకు ఫస్టాప్ లో చక్కగా చూపించారు. ఇంటర్వెల్ లో ఇచ్చిన ట్విస్ట్ బాగుందని చెప్పొచ్చు. ఇక ద్వితీయార్థంలో తండ్రి మరణం, తన కుటుంబం గురించి తెలుసుకున్న కొన్ని విషయాలకు పోతురాజు వేసే ప్రతి అడుగుకు కథ ఊపందుకుంటుంది. ట్విస్టులు, టర్నింగ్ పాయింట్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ లో హీరోలోని మాస్ యాంగిల్ తో పాటు ఎమోషనల్ సైడ్ నూ చూపించాడు. తన లక్ష్యాన్ని ఎలా గెలిచాడనేది ఆసక్తికరంగా ఉంటుంది.