రష్మీ గౌతమ్ సండే దావత్.. డ్రింక్స్ తాగుతూ చిల్ అవుతున్న అందాల యాంకర్..

Published : Jun 12, 2022, 06:36 PM IST

బుల్లి తెర అందాల యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) వీకెండ్ సందర్భంగా తన స్నేహితుల కలిసి దావత్ చేసుకుంది. డ్రింక్స్ తాగుతూ.. చీర్స్ చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.  

PREV
16
రష్మీ గౌతమ్ సండే దావత్.. డ్రింక్స్ తాగుతూ చిల్ అవుతున్న అందాల యాంకర్..

స్మాల్ స్క్రీన్ సుందరి, యాంకర్ రష్మీ గౌతమ్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై ఎక్స్ ట్రా జబర్దస్త్ (Jabardasth) కామెడీ షోతో బాగా పాపులర్ అయ్యింది. అంతకు ముందు సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బుల్లితెరను ఏలుతోంది.
 

26

రష్మీ గౌతమ్ ఎక్స్ ట్రా జబర్దస్త్ తో పాటు, ఈటీవీలో ప్రసారమయ్యే పలు ఈవెంట్లలోనూ పాల్గొంటూ అందరినీ ఆకట్టుకుంటుంది. తనకంటూ సెపరేట్  ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకుంది. అదే విధంగా లేటెస్ట్ ఫొటోషూట్లతోనూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తుంటుంది. 
 

36

అయితే ఎప్పుడూ షూటింగ్స్, ఈవెంట్స్, రియాలిటీ షోలతో బిజీగా ఉండే రష్మీ గౌతమ్ కు స్నేహితులతో కలిసి సరదాగా గడిపే సమయం దొరకడం లేదంట. సాయంత్రపు సమయంలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే అవకాశం లేకపోయిందంటూ బాధపడుతోంది. ఈ మేరకు ఓ వీడియోను ఇన్ స్టా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.
 

46

ఈ వీడియోలో రష్మీ గౌతమ్ ఓ రెస్టారెంట్ లో తన స్నేహితులరాలితో చిల్ అవుతూ కనిపించింది. సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ చీర్స్ చెబుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. కొందరు నెటిజన్లు తనకు మద్యం సీసా ఎమోజీలను షేర్ చేస్తూ క్రేజీగా చీర్స్ చెబుతున్నారు. తను పోస్ట్ చేసిన వీడియోను లైక్ లు, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.  

56

రష్మీ ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ పెట్టింది. ‘ఇలాంటి మరెన్నో అద్భుతమైన సాయంత్రాలకు చీర్స్. క్లిష్ట సమయాలను ఎదుర్కొంటూ దశల వారీగా ఎదగాలి’ అని పేర్కొంది. దీంతో తన అభిమానులు, ఫాలోవర్స్ సూపర్ క్యాప్షన్ అంటూ కామెంట్ సెక్షన్ అభిప్రాయపడ్డారు. 

66

ఇదిలా ఉంటే... వెండితెరపైనా మెరిసేందుకు ప్రయత్నిస్తోంది. పలు చిత్రాల్లో చిన్నతరహా పాత్రలను పోషించింది రష్మీ.  ఆ తర్వాత ‘డీజే టిల్లు’ ఫేం సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘గుంటూరు టాకీస్’తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అలాగే మెగా స్టార్ చిరంజీవి (Chirajeevi) నటిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రంలోనూ రష్మీ గౌతమ్ కనిపించనుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories