అనంతరం ఆమెతో విడిపోయారు. రెండో వివాహం రమ్య రఘుపతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇటీవల రమ్య రఘుపతి చీటింగ్ కేసులో చిక్కుకున్నారు. కొందరు వ్యక్తుల నుండి కోట్లు వసూలు చేసినట్లు ఆమె పై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో నరేష్ ఓ వీడియో ద్వారా రమ్యకు తనకు గల రిలేషన్ బయటపెట్టారు. ఒకప్పుడు ఆమె నాకు భార్యగా ఉన్న విషయం నిజమే... మేము విడిపోయి 5-6 ఏళ్ళు అవుతుంది. రమ్యతో గాని, ఆమె ఆర్థిక నేరాలతో గాని నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు.