మేకప్‌ లేకుండా అసలు అందం చూపిస్తూ షాకిచ్చిన రష్మి గౌతమ్‌.. ఫేస్‌లో బెంగ, నెటిజన్ల.. జబర్దస్త్ బ్యూటీకి ఏమైంది

Published : May 08, 2023, 07:01 AM ISTUpdated : May 08, 2023, 09:09 AM IST

జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్‌.. గ్లామర్‌ ట్రీట్‌తో ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. నెటిజన్లని అలరిస్తుంది. అటు జబర్దస్త్ షోలో, ఇటు సోషల్‌ మీడియాలో ఆమె చేసే సందడి మామూలుగా ఉండదు.   

PREV
17
మేకప్‌ లేకుండా  అసలు అందం చూపిస్తూ షాకిచ్చిన రష్మి గౌతమ్‌.. ఫేస్‌లో బెంగ, నెటిజన్ల.. జబర్దస్త్ బ్యూటీకి ఏమైంది

నవ్వుతూ, నవ్విస్తూ, అందంతో ఆకట్టుకుంటూ ఉండే యాంకర్‌ రష్మి.. తాజాగా మూడ్‌ ఔట్‌ అయ్యింది. కాస్త వికారం, బెంగ, తెలియని బాధతో ఆమె కనిపిస్తుంది. తాజాగా పంచుకున్న ఫోటోల్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి. సమ్‌ డేస్‌ ఆర్‌ జస్ట్ మెహ్‌.. అంటూ రష్మి పోస్ట్ చేసింది. 

27

అయితే ఇందులో రష్మి గౌతమ్‌ కనీసం మేకప్‌ కూడా వేసుకోలేదు. తన అసలైన అందాన్ని చూపిస్తూ షాకిచ్చింది. ఏదో బాధ ఆమెని వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం రష్మి గౌతమ్‌ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. 

37

యాంకర్‌ రష్మికి ఏమైందంటూ వాళ్లు ఆరా తీస్తున్నారు. ఆ బెంగకి కారణం సుధీరా? అంటూ కొందరు కామెంట్లు పెడుతుండటం గమనార్హం. ఏదేమైనా మేకప్‌ లేకుండా ఇలా డేరింగ్‌గా తన ఫోటోలు పంచుకుని ఆశ్చర్యపరుస్తుంది రష్మి. కానీ మేకప్‌ లేకపోయినా చాలా క్యూట్‌గా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తుండటం విశేషం. 
 

47

యాంకర్‌ రష్మి పదేళ్లుగా జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్‌గా చేస్తుంది. అత్యంత సక్సెస్‌ఫుల్‌ యాంకర్‌గా రాణిస్తుంది. యాంకర్‌ సుమ తర్వాత అత్యధికంగా ఒక షోకి యాంకర్‌గా చేయడం రష్మికే సాధ్యమైంది. దీంతోపాటు ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి కూడా యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. 
 

57

రష్మి గౌతమ్‌ తన డస్కీ అందంతో ఆకట్టుకుంటుంది. పైగా గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ అటు కమెడియన్లకి, ఇటు ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది. ఆకర్షిస్తుంది. దీనికితోడు ఆమె ముద్దుముద్దు మాటలు షోకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా చెప్పొచ్చు. రష్మిపై చాలా వరకు ఆడియెన్స్ పాజిటివ్‌గా ఉంటారు. 
 

67

ఆమె యానిమల్స్ విషయంలో తప్ప పర్సనల్‌గా ట్రోల్‌కి గురైంది చాలా తక్కువ. చాలా హుందాగా వ్యవహరిస్తూ మంచి యాంకర్‌గా పేరుతెచ్చుకుంది. ఇప్పటికీ అదే ఇమేజ్‌ని కంటిన్యూ చేస్తుంది. కానీ యానిమల్స్ విషయంలోనే ఆమె పలు మార్లు ట్రోల్స్ కి గురయ్యింది. రష్మి యానిమల్‌ లవర్‌ అనే విషయం తెలిసిందే. 
 

77

మరోవైపు జబర్దస్త్ షోలో.. కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తూ హాట్ టాపిక్‌ అవుతుంది. వీరిద్దరు షోలో డ్యూయెట్లు పాడుకోవడం, రొమాన్స్ చేసుకోవడం, లవ్‌ ఎక్స్ ప్రెస్‌ చేసుకోవడం జరిగిపోయాయి. అయితే సుధీర్‌ గతేడాది ఈ షోలను వదిలేసిన విషయం తెలిసిందే. దీంతో రష్మి ఒంటరైపోయింది. ఒంటరిగానే షోలను రన్‌ చేస్తుంది. కానీ మునుపటి క్రేజ్‌ మాత్రం కనిపించడం లేదు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories