పెళ్లంటే మీరు ఏమనుకుంటున్నారు అనగా ఏడు అడుగులు మూడు ముళ్ళు, జిలకర బెల్లం సార్ అనే స్టూడెంట్స్ చెప్పడంతో మీరు చెప్పినవన్నీ వివాహ బంధంలో ఉంటాయి. అసలు పెళ్లి అంటే రెండు మనసులు కలవడం. ధర్మేచ, కామేచ,మోక్షేచ ఇద్దరు ఒకటిగా బ్రతకడం అని అంటాడు. అప్పుడు పెళ్లిళ్లలో ఎన్ని రకాలు ఉన్నాయి. ఆ పెళ్లిళ్ల గురించి ఏంటి అనేది వివరిస్తూ ఉంటాడు జయచంద్ర. అప్పుడు రిషి,వసుధార సార్ చెప్పిన ఏ పద్ధతిలో మన పెళ్లి జరిగింది అని అడుగుతాడు. సార్ చెప్పిన ఎనిమిది రకాల వివాహాల్లో మనం చేసుకున్న వివాహం ఏ పద్ధతి అని అడుగుతాడు రిషి. చెప్పు వసుధార ఏ రకం అని అడుగుతాడు రిషి. అప్పుడు వసుధార కోపంతో పైకి లేచి సార్ ఈ ఎనిమిది రకాలు వివాహాలే కాకుండా ఇంకొక రకం వివాహం కూడా ఉంది సార్,అది కూడా చేర్చాలి, దాని పేరే ఆపత్కాల వివాహం అని అంటుంది.