ఐశ్వర్యా రాజేష్‌ మరో డేరింగ్‌ స్టెప్‌.. మొన్న యంగ్‌ హీరోకి, ఇప్పుడు సీనియర్‌ హీరోకి భార్యగా కమ్‌ బ్యాక్‌

Published : Jun 19, 2024, 04:54 PM ISTUpdated : Jun 19, 2024, 04:55 PM IST

ఐశ్వర్యా రాజేష్‌.. తెలుగులోకి మరోసారి కమ్‌ బ్యాక్‌ అవుతుంది. ఆ మధ్య టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల సరసన నటించే ఆఫర్లు రావడం లేదని కామెంట్‌ చేసింది. ఇప్పుడు సీనియర్‌ హీరోతో ఛాన్స్ కొట్టేసింది.   

PREV
17
ఐశ్వర్యా రాజేష్‌ మరో డేరింగ్‌ స్టెప్‌.. మొన్న యంగ్‌ హీరోకి, ఇప్పుడు సీనియర్‌ హీరోకి భార్యగా కమ్‌ బ్యాక్‌

 ఇప్పుడు సినిమాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. అలాగే హీరోయిన్‌ పాత్రల్లోనూ మార్పులు వస్తున్నాయి. యంగ్ హీరోయిన్స్ కూడా భార్య పాత్రలు, తల్లి పాత్రలు చేస్తున్నారు. ఆడియెన్స్ కూడా వాటిని ఆదరిస్తున్నారు. బ్రహ్మరథం పడుతున్నారు. కంటెంట్‌ బాగుంటే ఎవరు ఎలాంటి పాత్ర చేసినా అంగీకరిస్తున్నారు. 

27

అందులో భాగంగా డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్‌ తెలుగులో మరో డేరింగ్‌ స్టెప్‌కి రెడీ అయ్యింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఆమె మరోసారి టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తుంది. అయితే ఈసారి సీనియర్‌ హీరోకి జోడీగా నటిస్తుండటం ఓ విశేషమైతే, ఆయనకు భార్య పాత్రలో కనిపించబోతుండటం విశేషం. 

37

విక్టరీ వెంకటేష్‌.. `సైంథవ్‌` వంటి ఫెయిల్యూర్‌ తర్వాత ఇప్పుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ వినోదాత్మక మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కకించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అదిరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది. 
 

47

వెంకీ, అనిల్‌ రావిపూడి సినిమాలో హీరోయిన్‌ మీనాక్షి చౌదరి ఎంపికైంది. ఇప్పుడు మరో హీరోయిన్‌ని తీసుకుంటున్నారట. ఐశ్వర్యా రాజేష్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఆమెని వెంకటేష్‌ భార్య పాత్ర కోసం ఎంపిక చేశారని తెలుస్తుంది. ఇందులో మీనాక్షి చౌదరి పవర్‌ ఫుల్‌ మిలటరీ‌ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తుంది.

57

 మీనాక్షిది కీలక పాత్ర అని, ఐశ్వర్య రాజేష్‌ వెంకీ సరసన హీరోయిన్‌ పాత్ర అని తెలుస్తుంది. నిజం ఏంటనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.  ఇక ఐశ్వర్యా రాజేష్‌.. ఇప్పటికే తెలుగులో నాలుగైదు సినిమాలు చేసింది. `కౌసల్య కృష్ణమూర్తి` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చింది.

67

`మిస్‌ మ్యాచ్‌`, `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`, `టక్‌ జగదీష్‌`, `రిపబ్లిక్‌` చిత్రాలు చేసింది. ఆ తర్వాత ఆమె మళ్లీ కోలీవుడ్‌కే పరిమితమయ్యింది. తెలుగులో స్టార్‌ హీరోల సరసన తనకు ఆఫర్లు రావడం లేదని ఆ మధ్య వెల్లడించింది. ఇప్పుడు వెంకీకి జోడీగా ఎంపిక కావడం విశేషం. మరి కమ్‌ బ్యాక్‌ తర్వాత అయినా తెలుగులో బిజీ అవుతుందా? మళ్లీ కోలీవుడ్‌కే షిఫ్ట్ అవుతుందా అనేది చూడాలి. 
 

77

ఐశ్వర్యా రాజేష్‌ ఇప్పటికే పలు సినిమాల్లో హీరోకి భార్యగా, పిల్లలకు తల్లిగానూ నటించింది. `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`లో విజయ్‌ దేవరకొండకి భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగానూ నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీనియర్‌ హీరోకి భార్యగా నటించబోతుండటం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories