విలక్షణ నటుడు సత్యదేవ్ హీరోగా నటించిన `రావు బహదూర్` మూవీ క్రిటికల్‌గా ప్రశంసలందుకున్నా, బాక్సాఫీసు వద్ద మాత్రం దారుణమైన రిజల్ట్ ని చూస్తోంది. ఆదివారం బాక్సాఫీసు షాకిచ్చింది.
అద్భుతమైన నటనతో మెప్పించడంలో ముందుంటాడు సత్యదేవ్. ఇప్పుడున్న ఆయన తరం హీరోల్లో సత్యదేవ్ బెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు. `రావు బహదూర్` చిత్రంలోనూ అదే స్థాయిలో నటనతో మెప్పించాడు. తన నటనే సినిమాకి ప్లస్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మూడు డిఫరెంట్ ఏజ్ ఉన్న పాత్రలో ఆయన బాగా నటించి ప్రశంసలందుకున్నారు. దీనికితోడు కొత్త కథ. అయితే దాన్ని తెరపై ఆవిష్కరించడంలో తడబాటు కనిపిస్తుంది. వెంకటేష్ మ్యాజిక్ చేయలేకపోయాడు. దీంతో మూవీకి ఆడియెన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు.
24
రావు బహదూర్ మూవీకి 3 రోజుల కలెక్షన్లు
`రావు బహదూర్` మూవీ మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు పుంజుకుంది. మంచి వసూళ్లని రాబట్టింది. కానీ మూడో రోజు డీలా పడింది. ఆదివారం ఈ చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. ఇండియాలో ఇది ఫస్ట్ డే కోటిన్నర చేస్తే, రెండో రోజు రెండున్నర కోట్లు వసూలు చేసింది. దీంతో సినిమా పుంజుకుంటుందని టీమ్ భావించింది. కానీ మూడో రోజు గట్టి దెబ్బపడింది. కేవలం కోటి రూపాయలే రాబట్టింది. దీంతో ఇండియాలో ఈ మూవీకి రూ.4.85కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఇండియా గ్రాస్ రూ.5.5కోట్లుగా ఉంది.
34
షెడ్డుకే వెళ్లబోతున్న రావు బహదూర్
`రావు బహదూర్`కి ఓవర్సీస్‌లో మూడు కోట్ల వరకు వచ్చాయి. ఇక మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో అంటే తొలి వీకెండ్‌లో రూ.8.52కోట్లు రాబట్టింది. ఈ లెక్కన ఈ సినిమాకి షేర్ రూపంలో వసూలు చేసిన కలెక్షన్లు రూ.4.25కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ మూవీకి దాదాపు రూ.40కోట్ల బడ్జెట్ అయ్యిందని సమాచారం. నాన్ థియేట్రికల్‌గా రూ.12కోట్లు రాబట్టింది. ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీనికి రూ.7కోట్లు వచ్చినట్టు సమాచారం. అలాగే శాటిలైట్, ఆడియో రైట్స్ రూపంలో మరో ఐదు కోట్లు వచ్చాయని సమాచారం. థియేట్రికల్‌గా ఈ సినిమాకి ఇంకా రూ.25-28కోట్లు రావాలి. అంటే సుమారు రూ.50కోట్ల గ్రాస్‌ని వసూలు చేయాలి. ఇప్పుడు వస్తున్న కలెక్షన్లని బట్టి చూస్తే ఈ మూవీ సోమవారంతోనే షెడ్డుకు వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ లెక్కన ఇది మరో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మారబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
సత్యదేవ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో దీపా థామస్ హీరోయిన్‌గా చేసింది. మహేష్ బాబుకి చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శరత్ చంద్ర, అనురాగ్ వంటి వారు నిర్మించారు. అనుమానం నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. ఒక రాజవంశానికి చెందిన వారసుడు తన చిన్న కొడుకు తనకే పుట్టాడా అనే అనుమానంతో దిగజారిపోతాడు, అనారోగ్యానికి గురవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే సినిమా కథ. ఈ మూవీ అద్భుతంగా ఉందని మహేష్‌బాబు ట్వీట్ చేశారు. సినిమా చూశాక నెటిజన్లు ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. ఏం చూసి అద్భుతం అన్నారని కామెంట్ చేస్తున్నారు. మహేష్ బాబు ట్వీట్‌లన్నీ పెయిడ్ ట్వీట్లేనా అని కామెంట్ చేస్తుండటం గమనార్హం.