భర్త కౌగిలిలో ఒదిగిపోయిన అనసూయ.. మేకప్‌ లేకుండా కనిపించి సర్‌ప్రైజ్‌ చేసిన హాట్‌ యాంకర్‌

Published : Sep 01, 2022, 08:46 PM IST

యాంకర్‌ అనసూయ పేరు ఇప్పుడు ఎక్కడ చూసిన మారుమోగుతోంది. ఆమె గురించి చర్చే జరుగుతుంది. కానీ తను మాత్రం రిలాక్స్ గా భర్తతో ఎంజాయ్‌ చేస్తుంది. ఫ్యామిలీ టైమ్‌లో సరదాగా గడుపుతుంది. 

PREV
16
భర్త కౌగిలిలో ఒదిగిపోయిన అనసూయ.. మేకప్‌ లేకుండా కనిపించి సర్‌ప్రైజ్‌ చేసిన హాట్‌ యాంకర్‌

`జబర్దస్త్` యాంకర్‌ అనసూయ ఇంటర్నెట్‌ గత వారం రోజులుగా రచ్చ లేపుతుంది. దానికి సంబంధించి ఏదో ఒక ట్రోల్, న్యూస్‌ వైరల్‌ అవుతూనే ఉంది. కానీ అవేమీ పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుంటుంది అనసూయ. ఇప్పుడు ఫ్యామిలీతో బిజీగా గడుపుతుంది. ఇట్స్ ఫ్యామిలీ టైమ్‌ అంటోంది.
 

26

లెటెస్ట్ గా ఆమె భర్తతో దిగిన ఓ ఫోటోని పంచుకుంది. భర్త కౌగిలిలో ఒదిగిపోయి ముసి ముసి నవ్వులు నవ్వుతూ తీసిన సెల్ఫీ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. దీంతోపాటు తన ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

36

వినాయక చవితి పండుగ సందర్భంగా అనసూయ ఇలా ఫ్యామిలీతో సరదాగా గడిపింది. పూజా కార్యక్రమాల్లో పాల్గొంది. మరోవైపు వినాయకుడి కోసం నైవేద్యాలు తనే స్వయంగా ప్రిపేర్‌ చేసి గణేష్‌కి పెట్టడం విశేషం. ఈ పిక్స్ ని సైతం అనసూయ పంచుకుంది. మొత్తంగా ఆధ్యాత్మిక సేవలో ఆమె మునిగి తేలుతుందని చెప్పొచ్చు. 

46

అయితే ఇందులో అనసూయ మేకప్‌ లేకుండా కనిపించడం విశేషం. గతంలోనూ చాలా సార్లు మేకప్‌ లేకుండా కనిపించా షాకిచ్చిన అనసూయ ఈసారి కూడా దర్శనమిచ్చింది. ఈ హాట్‌ బ్యూటీ మేకప్‌ లేకపోయినా అందం ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. సహజంగా కూడా ఆమె అంతే అందంగా ఉండటం విశేషం. 
 

56

ఇదిలా ఉంటే అనసూయ ఈ మధ్య వరుసగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. `లైగర్‌` సినిమా రిజల్ట్ పై ఆమె చేసిన కామెంట్లు హాట్‌ టాపిక్‌ అయ్యాయి. `అమ్మని తిట్టిన ఊసురు ఊరికే పోలేదు` అంటూ అనసూయ చేసిన ట్వీట్‌ వివాదంగా మారింది. దీంతో వరుసగా ఆమెని ట్రోల్‌ చేశారు. `లైగర్‌` ఫ్యాన్స్. పర్సనల్‌ ఎటాక్‌ వరకు వెళ్లడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 
 

66

ఇదిలా ఉంటే అనసూయకి ఇలాంటి ట్రోల్స్ కామన్‌. ఆమె డ్రెస్‌పై తరచూ ట్రోల్స్ వస్తుంటాయి. ఆమె కూడా నెటిజన్లకి, ట్రోలర్స్ కి స్ట్రాంగ్‌ కౌంటర్లిస్తూ వారి నోళ్లు మూయిస్తుంటుంది. అయినా అవి ఆగడం లేదు. ఇది సోషల్‌ మీడియాలో కామన్‌ అయిపోయింది. కానీ ఈ సారి మరీ ఓవర్‌ అయిపోయింది. దీంతో ఆమె కొందరు నెటిజన్లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories