Ranasthali Review : రివేంజ్ డ్రామా 'రణస్థలి' రివ్యూ!

First Published Nov 26, 2022, 5:46 PM IST

చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కొద్దికాలంగా కంటెంట్ బాగుంటేమాత్రం ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో చిత్రమే ‘రణస్థలి’. ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.

చిన్న సినిమాగా ఈరోజు (నవంబర్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన రివేంజ్ డ్రామా ‘రణస్థలి’(Ranasthali). సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై అనుపమ సురెడ్డి నిర్మించిన చిత్రమే ‘రణస్థలి’. పరశురామ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ధర్మ హీరోగా అమ్ము అభిరామి, చాందిని రావులు హీరోయిన్లుగా నటించారు. ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర, విజయ్ రాగం..  కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే  టీజర్, ట్రైలర్ లతో ఆకట్టుకున్న ఈ చిత్రం థియేటర్లలో మెప్పించిందా? లేదా? ఇంతకీ కథేంటి? ఎలా ఉందనే విషయాలను రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథ :  బసవ (ధర్మ) సామాన్య కుటుంబానికి చెందిన వాడు. ధర్మకు మరదల్ అమ్ములు (చాందినీ రావు) ఉంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోవడంతో అమ్ములు బసవ ఇంట్లోనే పెరుగుతుంది. వీరిద్దరినీ బసవ తండ్రి మున్నియ్య (సమ్మెట గాంధీ)  పెంచి పోషిస్తాడు. పెద్దయ్యాయ వీరిద్దరికీ పెళ్లికూడా చేస్తారు. పెళ్లి తర్వాత బసవ కూడా ఆరునెలల్లో ప్రభుత్వ ఉద్యోగం చేరాల్సి ఉంది. ఇంకా సమయం ఉండటం.. కాస్తా అప్పులు కూడా ఉండటంతో చక్రవర్తి (బెనర్జీ) అనే పెద్దమనిషి వద్ద పని చేస్తాడు. అక్కడే అమ్ములు కూడా పనికి చేరుతుంది.  ఓ రోజు చక్రవర్తి  ఇంటికి కూలీపనుల కోసం నలుగురు పనివాళ్లు వస్తారు. చక్రవర్తి ఆదేశం మేరకు వారికి బసవ, అమ్ములు బస ఏర్పాటు చేస్తారు. ఆ నలుగురు వచ్చిన రోజే అమ్ములు, చక్రవర్తి హత్య చేస్తారు. ఇంతకీ అమ్ములు, చక్రవర్తిని చంపిన ఆ నలుగురు ఎవరు? వారి వెనక ఎవరున్నారు? విషయం తెలుసుకున్న బసవ శుత్రువులపై  ఎలా రివేంజ్ తీర్చుకున్నాడనేది మిగతా సినిమా.. 

విశ్లేషణ : రివేంజ్ డ్రామాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. మాస్ ఆడియెన్స్ ను ఎక్కువగా మెప్పించే చిత్రాలివే. తెలుగులో ఇప్పటికే ఇలాంటి చిత్రాలు చాలానే వచ్చాయి. ఇంకా వస్తున్నానే ఉండటం విశేషం. ఈ క్రమంలో తాజాగా రా అండ్ రస్టిక్ రివేంజ్ డ్రామాకా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే ‘రణస్థలి’. మాస్ ఆడియన్స్ కు, అలాగే యాక్షన్ ప్రియులను ఈ చిత్రం  తప్పకుండా  నచ్చుతుంది. ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో ఒకరకంగా అన్ని వర్గాల ప్రేక్షకులు తప్పకుండా చూడదగ్గ సినిమా ఇది. చిత్ర కథ కాస్తా రోటీన్ కు భిన్నంగా ఉంది. సినిమా సాగిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. హీరో ఫ్రెండ్ కిడ్నాప్ ఎపిసోడ్ ద్వారా దర్శకుడి ప్రతిభ ఏంటనేది అర్ధమవుతుంది, మాస్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసే విధంగా ఈ ఎపిసోడ్ ను డిజైన్ చేశారు. అలాగే లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ లు కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సినిమాకి క్లైమాక్స్ ప్రాణం అని చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లే కూడా ఎక్కడా బోర్ కొట్టదు. ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ యాక్షన్ ఎపిసోడ్స్ ను తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ ఆసక్తికరంగా ఉంటుంది. ఆడియెన్స్ కు కావాల్సిన అనుభూతిని అందిస్తుంది.

నటీనటుల : బసవ పాత్రలో నటించిన ధర్మ పాత్రకు న్యాయం చేశాడు.  చాలా బాగా నటించాడు. యాక్షన్ సన్నివేశాల్లో అనుభవం ఉన్న హీరోల్లాగా పెర్ఫార్మ్ చేయడం విశేషం. రివేంజ్ డ్రామాలో అన్నీ రకాల హావా భావాలను పలికించారు. ఇక అమ్ములు పాత్ర చేసిన హీరోయిన్ చాందినీ రావు చక్కగా నటించింది. అమ్ము అభిరామి పాత్ర కూడా మెప్పించింది. సమ్మెట గాంధీ హీరో తండ్రి పాత్రగా జీవించేశాడు. విలన్ గా చేసిన శివ కూడా టెరిఫిక్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక బెనర్జీ, చంద్ర శేఖర్, మధు మణి, శ్రీనివాస్ వెట్టి, ప్రశాంత్ పాండు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. 
 

టెక్నీకల్ టీం : డైరెక్టర్ పరశురామ్ శ్రీనివాస్ అనుకున్న పాయింట్ ను ఎంగేజింగ్ గా యాక్షన్ ఎపిసోడ్స్ తో చెప్పడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు. కెమెరామెన్ జాస్టి బాలాజీ  కూడా బాగా సహకరించి మంచి ఔట్పుట్ ఇచ్చాడు. కేశవ్ కిరణ్ సంగీతంలో రూపొందిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతం అనే చెప్పాలి. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించారు.  రన్ టైం కూడా 2 గంటల 20 నిమిషాలే ఉండడం సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. చిన్న సినిమా అయినా తమదైనంతలో చక్కటి ప్రతిభను చూపారు.

click me!