దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన రానా తొలి చిత్రం నుంచే వైవిధ్యం ఉన్న కథలపై ఆసక్తి చూపిస్తున్నాడు. నటుడిగా కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే బాహుబలి చిత్రంలో విలన్ గా నటించి జాతీయ స్థాయి మెప్పు పొందాడు. భళ్లాలదేవుడిగా రానా పవర్ ఫుల్ నటన ఎప్పటికీ గుర్తుంటుంది. ప్రస్తుతం రానా చేస్తున్న మరో ప్రయోగం 'విరాట పర్వం' చిత్రం.