కమల్ హాసన్ ని సత్కరించిన చిరు.. నా పాత మిత్రుడు అంటూ కామెంట్స్, 'విక్రమ్' పై మెగా రివ్యూ  

Published : Jun 12, 2022, 09:48 AM IST

ఎక్కడ చూసినా కమల్ హాసన్ విక్రమ్ సినిమా సంచలనాల గురించే చెప్పుకుంటున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలయ్యింది. 

PREV
16
కమల్ హాసన్ ని సత్కరించిన చిరు.. నా పాత మిత్రుడు అంటూ కామెంట్స్, 'విక్రమ్' పై మెగా రివ్యూ  

ఎక్కడ చూసినా కమల్ హాసన్ విక్రమ్ సినిమా సంచలనాల గురించే చెప్పుకుంటున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలయ్యింది. తమిళనాట ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తోంది. 200 కోట్ల కలెక్షన్స్ వైపు దూసుకుపోతోంది. తెలుగులో కూడా ఈ చిత్రం మంచి విజయం వైపు అడుగులు వేస్తోంది. 

26

లోకేష్ కనకరాజ్ తన టేకింగ్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేశాడు. దీనికి తోడు కమల్ నటన జత కావడంతో బాక్సాఫీస్ వద్ద దావానలం చెలరేగింది. చాలా రోజుల తర్వాత కమల్ హాసన్  పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దీనితో అభిమానులంతా కమల్ ఈజ్ బ్యాక్ అంటూ మురిసిపోతున్నారు. 

36

ఇదిలా ఉండగా కమల్ హాసన్ ప్, లోకేష్ కనకరాజ్ విక్రమ్ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నారు. శనివారం రోజు కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్ హైదరాబాద్ లో విక్రమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. అనంతరం ఒక క్రేజీ సంఘటన జరిగింది. మెగాస్టార్ చిరంజీవి.. కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్ తో పాటు విక్రమ్ టీం ని తన ఇంటికి ఆహ్వానించారు. 

 

46

వీరితో పాటు కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా హాజరు కావడం విశేషం. విక్రమ్ అఖండ విజయం సాధించిన సందర్భంగా కమల్ హాసన్ ని చిరు ఘనంగా సత్కరించారు. సల్మాన్ ఖాన్ సమక్షంలో ఈ సత్కారం జరిగింది. ఈ సంధర్భంగా  చిరు విక్రమ్ చిత్రం పై ప్రశంసలు కురిపించారు. 

56

విక్రమ్ విజయం సాధించిన సందర్భంగా నా పాత మిత్రుడు కమల్ హాసన్ ని సత్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. విక్రమ్ అద్భుతమైన ఇంటెన్స్ అండ్ థ్రిల్లింగ్ మూవీ. కమల్ హాసన్ కి శుభాకాంక్షలు. వారికి మరింత శక్తి చేకూరాలి అని చిరంజీవి ట్వీట్ చేశారు. 

 

66

కమల్ ని చిరు సన్మానించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కార్తీ ఖైదీ చిత్రంతో సత్తా చాటిన లోకేష్ కనకరాజ్.. విక్రమ్ తో సౌత్ లో తిరుగులేని దర్శకుడిగా మారిపోయారు. రాంచరణ్ తో కూడా లోకేష్ కనకరాజ్ ఓ చిత్రం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

click me!

Recommended Stories