తన తాత రామానాయుడు ఇండియాలోనే గొప్ప నిర్మాతలలో ఒకరు. తండ్రి సురేష్ బాబు కూడా నిర్మాత. బాబాయ్ విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ లో క్రేజీ స్టార్ హీరో. ఇంత బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ రానా స్టార్ డమ్ కావాలని ఎప్పుడూ ఆరాటపడలేదు. నటనకు ప్రాధాన్యత ఉన్న కథలనే ఎంచుకుంటున్నాడు. తన తొలి చిత్రంలోనే ముఖ్యమంత్రి పాత్రలో సీరియస్ రోల్ ప్లే చేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లీడర్ చిత్రంలో రానా ముఖ్యమంత్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.