Ramya Krishnan: సీఎంగా మారిన రమ్యకృష్ణ.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో `క్వీన్‌` సంచలనం

Published : Jul 11, 2026, 07:23 PM IST

Ramya Krishnan: సీనియర్‌ నటి రమ్యకృష్ణ ఇప్పుడు సీఎంగా మారారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా కనిపించబోతున్నారు. సీఎం లక్ష్మి ప్రణతిగా ఆమె ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలకు కేరాఫ్‌గా మారబోతున్నారు. 

PREV
13
విలక్షణ నటిగా రాణిస్తోన్న రమ్యకృష్ణ

విలక్షణ నటి రమ్యకృష్ణ తాను చేసే పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తారు. అద్భుతమైన నటనతో మెప్పిస్తారు. గ్లామర్‌ హీరోయిన్‌గానే కాదు, బలమైన రోల్స్ తోనూ మెప్పించారు. పాజిటివ్‌ రోల్స్ మాత్రమే కాదు, నెగటివ్‌ రోల్స్ కూడా చేయడానికి ఆమె ముందే ఉంటారు. `బాహుబలి`లో శివగామిగా ఆమె చూపించిన నట విశ్వరూపానికి అంతా ఫిదా అయ్యారు. ఆ మధ్య ఓటీటీలో `క్వీన్‌` మూవీతో మెప్పించారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించినట్టు సమాచారం.

23
క్వీన్‌లో సీఎం గా రమ్యకృష్ణ

ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి క్వీన్‌గా మారింది రమ్యకృష్ణ. సీఎంగా అలరించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలను సృష్టించేందుకు వస్తున్నారు. ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్‌ యామినీ ఈఆర్‌ ని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ `క్వీన్‌` మూవీని రూపొందిస్తున్నారు దర్శకుడు రతన్‌ రిషి. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమెది సీఎం రోల్‌ అని సమాచారం. లక్ష్మి ప్రణతి అనే ముఖ్యమంత్రి పాత్రలో ఆమె కనిపించబోతుందట. ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా వెల్లడించింది.

33
రియల్‌ ఇన్సిడెంట్స్ ఆధారంగా క్వీన్‌ మూవీ

ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది‌. ఇందులో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్ గా నటిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ హీరోయిన్ తండ్రి పాత్రను పోషిస్తున్నారు. ``క్వీన్` చిత్రంలో ఒక పవర్ ఫుల్, స్ట్రాంగ్ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ నటిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ తన నటనా ప్రతిభతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతున్నారు. `క్వీన్` చిత్రాన్ని వాస్తవ ఘటనల ఆధారంగా, రియల్ క్యారెక్టర్స్ ను స్ఫూర్తిగా తీసుకుని ఫిక్షనల్ స్టోరీతో దర్శకుడు రతన్ రిషి రూపొందిస్తున్నారు. 2006-2010 మధ్య కాలం నేపథ్యంగా ఈ చిత్ర కథ సాగనుంది. ప్రస్తుత సొసైటీ తో ముడిపడి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని ఈ చిత్రంలో ప్రేక్షకులు చూడబోతున్నారు. `క్వీన్` సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది` అని టీమ్‌ తెలిపింది. ఇందులో సాయికుమార్, అజయ్ ఘోష్, తనికెళ్ల భరణి, కాళకేయ ప్రభాకర్, నవీన్ బేతిగంటి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories