రమ్య కృష్ణ బర్త్ డే.. ఆ నాలుగు అంశాలు అగ్రస్థాయిలో నిలబెట్టాయి..!

First Published | Sep 15, 2023, 5:25 PM IST

సీనియర్ నటి రమ్య కృష్ణ ఎన్నో ఎళ్లుగా దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్నది. విభిన్న పాత్రలు పోషించి చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకుంది. ఒరిజినల్ లేడీ సూపర్ స్టార్ గానూ బిరుదు పొందింది. అగ్రస్థాయిలో ఉన్న ఆమె కెరీర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది.
 

సౌత్ ఆడియెన్స్ కు, ‘బహుబలి’ తర్వాత భారతీయ ప్రేక్షకులకు ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ (Ramya Krishna) పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో ఇప్పటి వరకు 200కు పైగా సినిమాల్లో లీడ్ రోల్ పోషించింది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
 

కాగా, ఈరోజు రమ్య కృష్ణ పుట్టిన రోజు (HBD Ramya Krishnan)  పుట్టిన రోజు కావడం విశేషం. 1970 సెప్టెంబర్ 15న శివగామీ చెన్నైలో జన్మించింది. తొలుత మలయాళం చిత్రాలతో యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించింది. 1985 నుంచి వెండితెరపై వెలుగుతూ వస్తోంది. దక్షిణాదిలోని అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, రజినీకాంత్, మోహన్ లాల్, కమల్ హాసన్, విష్ణు వర్దన్ వంటి హీరోల సరసన నటించి మెప్పించింది. కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది.
 

Latest Videos


మూడు దశాబ్దాలుగా సౌత్ లోని అన్నీ భాషల్లో నటిస్తూ చెరగని ముద్ర వేసుకుంది. ఎందరో బడా హీరోల సరసన ధీటుగా నటించి అలరించింది. గుర్తుండిపోయే పాత్రలతో లేడీ సూపర్ స్టార్ గానూ వెలుగొందింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో నూ భారీ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ వస్తోంది. తన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఇక ఆమె పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
 

రమ్యకృష్ణ కెరీర్ లో ప్రధానంగా నాలుగు అంశాలను ఆమెను లేడీ సూపర్ స్టార్ నిలబెట్టినట్టు ప్రముఖులు చెబుతుంటారు. మొదట ఆమె కెరీర్ జోరుగా సాగుతున్న క్రమంలోనూ.. ప్రముఖ కమెడియన్ గౌండమణి సరసన నటించేందుకు రమ్యకృష్ణ ఏమాత్రం సంకోచించలేదు. 1995లో ‘రాజా ఎంగ రాజా’ అనే చిత్రంలో  అమాయకమైన పల్లెటూరి అమ్మాయి పాత్రను పోషించింది. కెరీర్ లో అప్పటికే కొన్ని చిత్రాలు చేసినా కమెడియన్ సరసన నటించడం అందరినీ ఆశ్చర్యపరించింది.
 

ముఖ్యంగా రమ్యకృష్ణ తన కెరీర్ ప్రారంభంలోనే చేసే పాత్రల విషయం వైవిధ్యం ఉండేలా చూసుకుంది. దేవీ పాత్రల్లో నటించేందుకు ఆమె తీసుకున్న నిర్ణయం మరో మెట్టు ఎక్కించింది. ‘అమ్మోరు’, ‘పొట్టు అమ్మన్, అన్నై కలిగంబల్, రాజకాళి అమ్మన్ వంటి చిత్రాలలో దేవతగా అలరించింది. ఇప్పటికీ వెండితెర దేవతగా రమ్య కృష్ణ చెరగని ముద్ర వేశారు. 
 

దైవభక్తితో కూడిన పాత్రల్లో కాదు.. తన గ్లామరస్‌తోనూ ప్రేక్షకులను మెప్పించింది. 80, 90లో ఆమె సాంప్రదాయక ఇమేజ్‌ని బద్దలు కొట్టడం. కెరీర్ ప్రారంభంలో నుంచి 2000వ దశకం ప్రారంభం వరకు ప్రముఖ తారల సరసన ప్రత్యేక పాత్రల్లో కనిపించింది. స్పెషల్ అపియరెన్స్ తోనూ అదరగొట్టింది. ఇక ‘బాహుబలి’ తర్వాత ఎంత ఎత్తు ఎదిగినా ప్రస్తుతం టీవీ షోల్లోనూ మెరుస్తూ రావడం విశేషం.  ‘ఢీ‘ ‘బిగ్ బాస్3’, ‘డాన్స్ ఐకాన్’ షోలతో అలరించిన విషయం తెలిసిందే. ఇక చివరిగా రమ్యకృష్ణ ‘లైగర్‘లో నటించింది.
 

click me!