మహేష్ బాబు తో ఐటమ్ సాంగ్ చేసి, తర్వాత తల్లిగా కూడా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Published : May 22, 2025, 03:34 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబకు చాలామంది ఓల్డ్ హీరోయిన్లు తల్లిగా నటించారు. కాని ఓ స్టార్ హీరోయిన్ మాత్రం మహేష్ బాబుతో ముందుగా ఐటమ్ సాంగ్ లో హాట్ హాట్ గా నటించింది. ఆతరువాత కాలంతో సూపర్ స్టార్ కు తల్లిగా కూడా నటించింది. ఇంతకీ ఎవరా హీరోయిన్, ఎంటా సినిమా? 

PREV
15

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటీనటుల కాంబినేషన్లు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి ఒక అరుదైన కలయిక మహేష్ బాబు, రమ్యకృష్ణలదే. ఒకే హీరోతో ఒక సినిమాలో స్పెషల్ సాంగ్‌కి డాన్స్ చేయడం, మరో సినిమాలో అతని తల్లిగా కనిపించడం వంటి వినూత్న విషయాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాయి.

25

తెలుగు సినీ ప్రేమికులకు తెలుసు - రమ్యకృష్ణ మల్టీటాలెంటెడ్ యాక్ట్రస్ అని. గతంలో గ్లామర్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన రమ్యకృష్ణ.. ఆతరువాత మంచి మంచి క్యారెక్టర్ రోనల్స్ కూడా చేస్తోంది. ఆక్రమంలో ఆమె మహేష్ బాబుతో కలిసి రెండు విభిన్న చిత్రాల్లో నటించారు. మొదటిగా 2004లో వచ్చిన నాని చిత్రంలో, రమ్యకృష్ణ స్పెషల్ ఐటమ్ సాంగ్ అయిన 'మార్కండేయా' కి మహేష్ బాబుతో కలిసి స్టెప్పులేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ పాట ఇప్పటికీ పాపులర్ ఐటమ్ నంబర్‌లలో ఒకటిగా నిలిచింది.

35

అయితే ఈసినిమా వచ్చిన 20 ఏళ్ల తరువాత రమ్యకృష్ణ, 2024లో విడుదలైన గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకు తల్లి పాత్రలో నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కాని బాక్సాఫీస్ దగ్గర మాత్రం మంచి వసూళ్లు రాబట్టింది. రమ్యకృష్ణ పాత్ర సినిమాకు కీలకంగా నిలిచింది. ఆమె సహజమైన అభినయం ప్రేక్షకులను మెప్పించింది.

45

ఒకే హీరోతో ఒకసారి గ్లామర్ రోల్, మరొకసారి భావోద్వేగ పాత్ర చేయడం ఇండస్ట్రీలో చాలా అరుదు. రమ్యకృష్ణ-మహేష్ బాబు కాంబినేషన్ కుమాత్రమే ఈ అవకాశం లభించింది. కాని ఈ విషయంలో ఆడియన్స్ లో కొంత మంది డిపరెంట్ గా కామెంట్ చేస్తున్నారు. ఇలా ఐటమ్ సాంగ్ చేసిన హీరోయిన్ తో తల్లిగా నటించడం ఏటీ అంటు కొంత మంది గుసగుసలాడుకున్నారు కూడా.

55

ఇక ప్రస్తుతం మహేష్ బాబు, పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో పాన్ వరల్డ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ లో మహేష్ బాబు బిజీగా ఉన్నారు. ఈ సినిమా దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. ప్రపంచ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో సూపర్ స్టార్ జోడీగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories