Ramba Oorvasi Menaka Day 1 Collections: రంభ ఊర్వశి మేనక ఫస్ట్ డే కలెక్షన్లు.. అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌

Published : Sep 05, 2026, 10:28 AM IST

Ramba Oorvasi Menaka Day 1 Collections: అల్లరి నరేష్‌ హీరోగా నటించిన మూవీ `రంభ ఊర్వశి మేనక`. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రానికి నెగటివ్‌ టాక్‌ వచ్చింది. మరి బాక్సాఫీసు వద్ద మొదటి రోజు ఎంత వసూలు చేసిందనేది చూస్తే.

PREV
14
కామెడీ ట్రాక్‌లోకి వచ్చిన అల్లరి నరేష్‌

కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన అల్లరి నరేష్‌.. ఇటీవల కాలంలో కామెడీ సినిమాలు తగ్గించారు. నిజం చెప్పాలంటే పూర్తి కామెడీ మూవీ చేసి చాలా రోజులవుతుంది. మధ్యలో యాక్షన్, థ్రిల్లర్స్ మూవీస్‌ చేశారు. కొన్ని మల్టీస్టారర్స్ కూడా చేశారు. అవి కొన్ని సక్సెస్‌ అయ్యాయి. ఈ క్రమంలో చాలా మంది ఆయన అభిమానులు మళ్లీ కామెడీ సినిమాలు చేస్తే చూడాలని భావించారు. తమ కోరికని వెల్లడించారు. దీంతో చాలా గ్యాప్‌తో తన మార్క్ పూర్తి కామెడీ సినిమా చేశాడు అల్లరి నరేష్‌. `రంభ ఊర్వశి మేనక` చిత్రంలో నటించాడు. చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సురభి, రాశీ సింగ్‌, విష్ణు ప్రియా భీమనేని, ప్రిషా సింగ్‌ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్‌, నరేష్‌ వీకే, శ్రీనివాస్‌ రెడ్డి వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. హాస్య మూవీస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకాలపై రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మించారు.

24
రంభ ఊర్వశి మేనక మూవీకి నెగటివ్‌ టాక్‌

శుక్రవారం(సెప్టెంబర్‌ 4)న విడుదలైన ఈ మూవీకి ప్రారంభం నుంచే నెగటివ్‌ టాక్‌ వచ్చింది. కామెడీ ఆశించిన స్థాయిలో వర్కౌట్‌ కాలేదు. నటుడిగా అల్లరి నరేష్‌ మెప్పించాడు. లుక్‌ పరంగానూ ఆకట్టుకున్నాడు. కానీ కామెడీ థియేటర్లో పండలేదు. దీంతో ఆడియెన్స్ నుంచి పెదవి విరుపు కనిపించింది. మదర్‌ సెంటిమెంట్‌ ఫర్వాలేదనిపించింది. చివర్లో అదొక్కటే రిలీఫ్‌. దీనికితోడు రంభ, ఊర్వశి, మేనకలను టచ్‌ చేసే క్రమంలో వచ్చే సన్నివేశాలు, పాత పాటలు నవ్వులు పూయిస్తాయి. అలరిస్తాయి. ఈ రెండు తప్ప మూవీలో ఆకట్టుకునే అంశాలు లేవని అంటున్నారు. మొత్తంగా మూవీకి డిజాస్టర్‌ టాక్‌ వస్తోంది. మరి ఈ చిత్రానికి కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూస్తే.

34
రంభ ఊర్వశి మేనక మూవీ కలెక్షన్లు

ఈ మూవీ మొదటి రోజు అల్లరి నరేష్‌ కెరీర్‌లోనే అతి తక్కువ ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. ఈ సినిమాకి ఇండియాలో రూ.88లక్షల కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్‌ కలుపుకొని కోటి రూపాయలు వచ్చాయి. ఇది అల్లరి నరేష్‌ కెరీర్‌లోనే అతి తక్కువ వసూళ్లు కావడం గమనార్హం. నెగటివ్‌ టాక్ మూవీపై చాలా ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. మొత్తంగా మొదటి రోజు ఈ చిత్రానికి సుమారు యాభై లక్షల షేర్‌ మాత్రమే వచ్చింది.

44
రంభ ఊర్వశి మేనక బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

ఇక `రంభ ఊర్వశి మేనక` చిత్రానికి అయిన బడ్జెట్‌ రూ.15కోట్లు అని సమాచారం. థియేట్రికల్‌గా దీన్ని రూ.4.5కోట్లకు అమ్మారట. అంటే సుమారు 10కోట్ల గ్రాస్‌ వసూలు చేస్తే మూవీ సేఫ్‌లో ఉంటుంది. అయితే మూవీ పుంజుకుంటే అది పెద్ద సమస్య కాదు, కానీ డల్‌ అయితే మాత్రం నష్టాలు తప్పవు. మరి ఇది ఎంత వరకు పుంజుకుంటుంది, అల్లరి నరేష్‌ ఎంత వరకు సత్తా చాటుతాడనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories