సీనియర్ నటుడు శరత్ బాబు మే 22న మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. తెలుగు తమిళ భాషల్లో శరత్ బాబు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో అంతే అద్భుతంగా నటించారు. అయితే శరత్ బాబు జీవితంలో వివాదాలు కూడా గుర్తుకు వస్తాయి.
ముఖ్యంగా రమాప్రభతో వివాహం ఆ తర్వాత విడిపోవడం టాలీవుడ్ లో సంచలన సంఘటనే.అయితే వీరిద్దరూ విడిపోయాక కూడా సైలెంట్ గా ఉండలేదు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. శరత్ బాబుని ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేసిందే తాను అని రమాప్రభ అంటే..ఆమెతో పరిచయం కి ముందే తాను పాపులర్ అయ్యానని శరత్ బాబు అన్నారు.
sarath babu
రామప్రభకి 60 కోట్ల వరకు ఆస్తి ఇచ్చినట్లు కూడా గతంలో ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. అయితే గత నెలరోజులుగా శరత్ బాబు అనారోగ్యం, మృతి వల్ల రమాప్రభ పేరు కూడా మీడియాలో బాగా వైరల్ అయింది. తాజాగా రమాప్రభ ఈ అంశాలపై పరోక్షంగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రమాప్రభ మాట్లాడుతూ.. తన గురించి అనవసర పుకార్లు సృష్టిస్తున్నారు అని నిజం ఏంటో అందరికీ తెలుసు అని రమాప్రభ అన్నారు.
చెన్నైలో నాకొక ఇల్లు ఉంది. కానీ ఆ ఇంట్లో ఎవరెవరో ఉంటున్నారు. కానీ నా పేరు మాత్రం చెప్పడం లేదు. నేను 13 ఏళ్ల నుంచే సంపాదిస్తున్నాను. రజనీకాంత్ లాంటి హీరోలు నాకు డబ్బు ఇచ్చినట్లు వార్తలు సృష్టిస్తున్నారు. ఈ మూడు నెలల కాలంలో చాలా జరిగాయి. నాకు కూడా పర్సనల్ గా కొన్ని సంఘటనలు జరిగాయి. మనకు జరిగినప్పుడే స్పందిస్తాం. కానీ ప్రపంచంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. అన్నింటికీ స్పందిస్తున్నామా అని రమాప్రభ ప్రశ్నించారు.
sarath babu
ఈ మూడు నెలల్లో నేను తిరుపతి, షిరిడి , హైదరాబాద్, విజయవాడ వెళ్లి వచ్చాను అని రమాప్రభ అన్నారు. ఈ మధ్య నేను ఏదోరకంగా పాపులర్ అవుతున్నాయి. ఈ మధ్య జరిగిన ఒకటి రెండు సంఘటనలు నా గురించే కాబట్టి మాట్లాడుతున్నా. ఇటీవల కొన్ని దృశ్యాలు చూసినప్పుడు అందరికంటే ఎక్కువ కదిలేది నేనే. అది అర్థం అయినవాళ్లకు అర్థం అవుతుంది. కానీ నేను నటించాలా డ్రామా చేయాలా ? అని రమాప్రభ ప్రశ్నించారు.
ఇప్పుడు నేను ప్రశాంతంగా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ శాస్త్రం ప్రకారం అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నా, పద్ధతి ప్రకారం అన్నీ పాటిస్తున్నా అని రమాప్రభ పరోక్షంగా శరత్ బాబు మరణం గురించి స్పందించారు. కానీ ఒక స్థితి గురించి ఎంతో పొగుడుతూ కీర్తిస్తున్నారు.. ఆ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది.. ఆ పొగడ్తలు ఎవరి వల్ల ? దానికి బేసిక్ కారణం నేను కాదా.. దీనిని మాత్రం మరచిపోయి ఏవేవో మాట్లాడుతున్నారు అంటూ రమాప్రభ యూట్యూబ్ ఛానల్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది.
13 ఏళ్ళు కలసి ఉన్నారు కాబట్టి ఆ బాధ ఉంటుంది. శరత్ బాబుని హీరోగా నిలబెట్టడం కోసం మీరు సొంతంగా సినిమా తీసిన సంగతి కూడా ప్రపంచానికి తెలుసు. మీరు వేసిన పునాదివల్లే శరత్ బాబు గొప్ప నటుడయ్యారు అంటూ నెటిజన్లు రమాప్రభకి మద్దతు తెలుపుతున్నారు.