`ఆదిపురుష్‌` టోటల్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌.. ఇప్పుడే ఇంత వచ్చిందంటే.. బాగుంటే కాసుల పంటే

First Published Jun 2, 2023, 10:27 PM IST

`ఆదిపురుష్‌`పై మంచి బజ్‌ నెలకొంది. ఇది బిజినెస్‌ పరంగానూ కలిసొస్తుంది. తాజాగా ఈ సినిమా బిజినెస్‌ పరంగా రికార్డులు క్రియేట్‌ చేస్తుంది.  ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్‌ రైట్స్ భారీగా అమ్ముడు పోయిందట.

ప్రభాస్‌ నటించిన `ఆదిపురుష్‌` సినిమాపై ఇప్పుడు అందరి చూపు ఉంది. రామాయణం ఆధారంగా రూపొందిన చిత్రం కావడంతో సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.  ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. టీజర్‌తో విమర్శలు ఎదుర్కొన్న ఈ సినిమాపై ట్రైలర్‌ తారుమారు చేసింది. ఆ విమర్శలను పటా పంచల్‌ చేసింది. విడుదలైన రెండు పాటలకి విశేష ఆదరణ దక్కింది. దీంతో `ఆదిపురుష్‌`పై మంచి బజ్‌ నెలకొంది. ఇది బిజినెస్‌ పరంగానూ కలిసొస్తుంది. 

తాజాగా ఈ సినిమా బిజినెస్‌ పరంగా రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్‌ రైట్స్ భారీగా అమ్ముడు పోయిందట. రూ.185కోట్లకి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకుంది. అయితే వాస్తవంగా ఇరవై ముప్పై కోట్లకు తక్కువగానే ఉంటుందని ట్రేడ్‌ వర్గాల అంచనా. ఇదిలా ఉంటే నాన్ థియేట్రికల్‌గా ఈ సినిమా దుమ్ము రేపిందట. ఏకంగా రూ.250కోట్లకి నాన్ థియేట్రికల్‌ రైట్స్ అమ్ముడు పోయినట్టు సమాచారం. అన్ని భాషలు కలుపుకుని శాటిలైట్‌, ఓటీటీ రైట్స్ కలుపుకుని ఈ మొత్తానికి ప్రముఖ సంస్థ దక్కించుకుందని సమాచారం.

ఈ మొత్తం చూస్తే సుమారు నాలుగు వందల ముప్పై కోట్లు వచ్చినట్టే. ఈ సినిమా బడ్జెట్‌ 500కోట్లు. ఇప్పటికే 430కోట్లు వచ్చాయి. దీనికితోడు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ(నార్త్), ఓవర్సీస్‌ రైట్స్ ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. నార్త్ లో నిర్మాణ సంస్థ టీ సిరీస్‌ సొంతంగా రిలీజ్‌ చేస్తుందని సమాచారం. అది పక్కన పెడితే మిగిలిన భాషలు కలుపుకుంటే ఈ సినిమా రిలీజ్‌ కి ముందే ప్రాఫిట్‌లోకి వెళ్తుందని చెప్పొచ్చు. ఇక సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తే.. థియేట్రికల్‌గా ఇది సంచలనం సృష్టిస్తుంది. ఏమాత్రం బాగుందన్నా నార్త్‌లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. 

ఈ నెల 6న తిరుపతిలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. ఇది కూడా నెవర్‌ బిఫోర్‌ అనేలా ఉంటుందని సమాచారం. అంతేకాదు ఈ సినిమా నుంచి మరో ట్రైలర్‌ని రిలీజ్‌ చేయబోతున్నారట. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రోజున విడుదలయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. రెండున్నర(2.27) నిమిషాలు నిడివితో ట్రైలర్‌ ఉంటుందని సమాచారం. ఇక ప్రభాస్‌ హీరోగా, కృతి సనన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు. సైఫ్‌ అలీ ఖాన్‌ నెగటివ్‌ రోల్‌(రావణుడు) చేస్తున్నారు. 
 
click me!