Reality Show: బిగ్ బాస్ ని మించిన వింత, కాంట్రవర్షియల్ రియాలిటీ షోలు.. ఫ్యూజులు ఎగిరిపోతాయి..!

Published : Sep 08, 2026, 04:17 PM IST

Reality Show: ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ ని ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. అక్కడ జరిగే కాంట్రవర్శీలకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. కానీ బిగ్ బాస్ ని మించిన కాంట్రవర్శీలతో ఉన్న షోలు కూడా ఉన్నాయి.

PREV
15
బిగ్ బాస్ ని మించిన రియాల్టీ షోలు ఇవి..

మన దేశంలో రియాల్టీ షో అనేగానే అందరికీ బిగ్ బాస్, ఇండియన్ ఐడల్, కౌన్ బనేగా కరోడ్ పతి ఈ కార్యక్రమాలే గుర్తుకువస్తాయి. ఈ షోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే, వీటికి భిన్నంగా, వినడానికి కూడా వింతగా ఉండే రూల్స్ తో కొన్ని ప్రయోగాత్మక రియాల్టీ షోలు కూడా వచ్చాయని మీకు తెలుసా? కంటెస్టెంట్స్ ని గత జన్మలోకి తీసుకువెళ్లడం, స్టేజ్ పైనే పెళ్లిళ్లు, పిల్లల పెంపకం తో భారతీయ టీవీ చరిత్ర లో సెన్సేషన్ క్రియేట్ చేసిన కొన్ని వింత రియాల్టీ షోల గురించి ఇప్పుడు చూద్దాం..

25
రాజ్ పిచ్లే జన్మ్ కా... పూర్వ జన్మ జ్ఞాపకాలు..

ఈ షో కాన్సెప్ట్ చాలా వింతగా ఉంటుంది. ఇందులో పాల్గొనే సెలబ్రిటీలను లేదా సామాన్యులను డాక్టర్ సమక్షంలో స్టేజ్ పైనే హిప్నోటైజ్ చేస్తారు. వారిని పూర్వ జన్మ జ్ఞాపకాల్లోకి తీసుకొని వెళతారు. వారి పూర్వ జన్మకు సంబంధించిన విషయాలను గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ షో అప్పట్లో బాగా సంచలనం అయ్యింది.

35
లాక్ అప్ (Lock Upp) – రహస్యాలు

కంగనా రనౌత్ హోస్ట్ చేసిన ఈ ఓటీటీ షో ఒక డిజిటల్ జైలు వాతావరణాన్ని తలపించింది. ఇందులో పోటీదారులు ఎలిమినేషన్ డేంజర్ జోన్ నుండి తప్పుకోవాలంటే, తమ పర్సనల్ లైఫ్‌లో ఎవరికీ తెలియని అత్యంత డార్క్, పర్సనల్ సీక్రెట్స్‌ని నేరుగా కెమెరా ముందే ఒప్పుకోవాల్సి వచ్చేది. ఒక్కో రహస్యం బయటపెడితేనే వారికి షోలో లైఫ్ దక్కేది. ఈ షో కూడా అప్పట్లో బాగా సంచలనం సృష్టించింది.

3. ఇస్ జంగల్ సే ముజే బచావో ..

అడవిలో క్రూరమైన టాస్క్‌లు! విదేశీ రియాలిటీ షో ఆధారంగా వచ్చిన ఈ షోలో సెలబ్రిటీలను మలేషియాలోని దట్టమైన అడవుల్లో వదిలేశారు. అక్కడ బ్రతకాలంటే వారు పురుగులను పచ్చిగా తినడం, విషపూరితమైన పాములు , తేళ్లతో నిండిన పెట్టెల్లో ఉండటం వంటి అత్యంత జుగుప్సాకరమైన, ప్రమాదకరమైన టాస్క్‌లు చేయాల్సి వచ్చేది.

45
స్వయంవర్ సిరీస్ (Swayamvar) –

టీవీ లైవ్‌లోనే పెళ్లిళ్లు మన పురాణాల్లో విన్న స్వయంవరాన్ని ఆధునిక టీవీకి పరిచయం చేసిన షో ఇది. రాఖీ సావంత్, రాహుల్ మహాజన్, రతన్ రాజ్‌పుత్ వంటి సెలబ్రిటీలు తమకు కాబోయే భాగస్వామిని ఎంచుకోవడానికి లైవ్ టీవీలోనే ఈ కార్యక్రమం పెట్టారు. కోట్లాది మంది చూస్తుండగానే పెళ్లి నిశ్చయాలు, గొడవలు, డ్రామాలు జరగడం అప్పట్లో విపరీతమైన పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. తెలుగులో కూడా పెళ్లి చూపులు అని ఇలాంటి కాన్సెప్ట్ షో చేశారు. కానీ, పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.

55
పతీ పత్నీ అవుర్ ఓ..ఇతరుల పిల్లలను పెంచాలి..

ఇది పూర్తిగా ఒక విచిత్రమైన సైకలాజికల్ డ్రామా. పెళ్లి కాని లేదా పిల్లలు లేని సెలబ్రిటీ జంటలకు వేరే వాళ్ల చిన్న పిల్లలను, పసిపాపలను అప్పగించేవారు. వారి పేరెంటింగ్ స్కిల్స్‌ను పరీక్షించే పేరుతో పిల్లల ఏడుపులు, డయాపర్లు మార్చడం, అర్ధరాత్రి నిద్రలేవడం వంటి రచ్చతో షో సాగేది.

6. ది స్విచ్ – లైఫ్‌స్టైల్ మార్పిడి..

పూర్తి భిన్నమైన రెండు ప్రపంచాలను కలిపిన కాన్సెప్ట్ ఇది. ఒకవైపు విలాసవంతమైన జీవితం గడిపే రిచ్ కిడ్, మరోవైపు రోజూ కష్టపడే సామాన్యుడు. వీరిద్దరూ తమ ఇళ్లు, ఉద్యోగాలు, ఫ్రెండ్స్ , జీవనశైలిని కొన్ని రోజుల పాటు పరస్పరం మార్చుకుని జీవించాలి. ధనవంతులు సాధారణ జీవితం గడపలేక పడే అగ్నిపరీక్షలు ఈ షోలో ప్రధాన హైలైట్‌గా నిలిచాయి.

ఇలాంటి వింత, కాంట్రవర్షియల్ ప్రయోగాలు భారతీయ టీవీ రంగాన్ని ఒక ఊపు ఊపాయి. బిగ్ బాస్ కంటే ముందే వచ్చిన ఈ షోలు ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేయడమే కాకుండా, వినోదం పేరుతో టీవీ ఛానెళ్లు ఏ స్థాయికి వెళ్లగలవో నిరూపించాయి.

Read more Photos on
click me!

Recommended Stories