మహేష్ తో అలాంటి సినిమానే చేస్తా.. బాలయ్య, పవన్, ఎన్టీఆర్ తో మూవీస్ పై హరీష్ శంకర్ ప్లాన్ ఇదే

First Published | Aug 8, 2024, 11:50 AM IST

ఆవేశం సినిమా నేను చూడలేదు. దాని గురించి నా దాకా రాలేదు. మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయ్యాక చూద్దాం అంటూ సస్పెన్స్ లోకి నెట్టారు.

మాస్ చిత్రాల డైరెక్టర్ హరీష్ శంకర్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. రవితేజ, భాగ్యశ్రీ జంటగా నటిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఆలస్యం కావడంతో హరీష్ నుంచి గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. హీరోయిన్ గురించి కూడా సోషల్ మీడియాలో హాట్ హాట్ గా డిస్కషన్ జరుగుతోంది. 

రీసెంట్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ మీడియాతో అనేక విషయాలు మాట్లాడారు. తదుపరి చిత్రాల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్స్ అయితే రవితేజ, పవన్ కళ్యాణ్ కలసి ఉన్న పోస్టర్ చూపించారు. ఆ పోస్టర్ బావుంది. కెమెరా అటువైపు తిప్పండి అంటూ హరీష్ కామెంట్ చేయడం విశేషం. రవితేజ, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ ఎప్పుడు అని ఫ్యాన్స్ అడగగా.. మీరు కోరుకోండి అయిపోతుంది అంటూ హరీష్ సరదాగా బదులిచ్చారు. ఓ మీడియా ప్రతినిధి కూడా దీని గురించి ప్రశ్నించింది. దీని గురించి అందరూ అడుగుతున్నారు. ఈ మల్టీస్టారర్ చిత్రం చేయాలంటే మంచి స్క్రిప్ట్ ఐడియా రావాలి. ఐడియా రాగానే సీనియర్ గా ట్రై చేస్తా అని హరీష్ అన్నారు. 


మరో ప్రతినిధి ఫహద్ ఫాజిల్ సూపర్ హిట్ చిత్రం ఆవేశం గురించి అడిగారు. ఆవేశం చిత్రాన్ని బాలయ్యతో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం అని ప్రశ్నించారు. హరీష్ బదులిస్తూ.. నేను ఇప్పుడు మిస్టర్ బచ్చన్ తో బిజీగా ఉన్నా. ఆవేశం సినిమా నేను చూడలేదు. దాని గురించి నా దాకా రాలేదు. మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయ్యాక చూద్దాం అంటూ సస్పెన్స్ లోకి నెట్టారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు అయితే.. హరీష్ ఆవేశం చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

మరో మీడియా ప్రతినిధి మాట్లాడుతూ.. మీరు మహేష్ బాబుతో సినిమా చేయాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది అని అడిగారు. నేను తప్పకుండా మహేష్ బాబుతో సినిమా చేస్తాను. పోకిరి చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. అది నాకు ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. మహేష్ బాబుతో సినిమా చేస్తే అలాంటి సినిమానే చేస్తా అని హరీష్ అన్నారు. 

చివరగా ఎన్టీఆర్ గురించి ప్రశ్న కూడా ఎదురైంది. హరీష్, ఎన్టీఆర్ కాంబోలో రామయ్య వస్తావయ్యా అనే చిత్రం వచ్చింది. ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. ఆ చిత్రం తర్వాత ఎన్టీఆర్ కి తప్పకుండా హిట్ ఇస్తానన్నారు. ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు అని ప్రశ్నించారు. తాను ఎన్టీఆర్ తో సినిమా కోసం ట్రై చేయలేదని.. ట్రై చేసినప్పుడు చెబుతా అని హరీష్ సమాధానం ఇచ్చారు. 

Latest Videos

click me!