కథేంటి:పెళ్లై పిల్లల్లేని ఓ జంట ఓ పెద్ద ఇంట్లో కాలక్షేపం చేస్తుంటారు. ఆ భర్తకు తన భార్య శ్రీ రాపాక (స్వీటీ)పై మోజు తగ్గిందో.. అసలు లేదో కానీ ఆమెతో టైమ్ స్పెండ్ చేయడు. ఈ విధంగా సీన్స్ సాగుతూండగా ఓ రోజు ఆ ఇంట్లో పనిచేసే సదరు పనివాడు (జమాల్) మరియు వంటవాడు.. అనుకోకుండా ఆమెను నగ్నంగా చూస్తాడు.
undefined
తదితర పరిణామాలు ఊహించో ఏమో భయపడి బయిటకు పరుగెత్తుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ సన్నివేశాల తర్వాత ఆమె ఆ పనోడిపై మనస్సు... ఆ తర్వాత శరీరం పారేసుకుంటుంది. అక్రమమైన ఆ సంబంధం మొదలై కొనసాగుతుంది. అయితే ఇలాంటి విషయాలు ఎన్నో రోజులు సాగవు... ఓ రోజు ఆ భర్త హఠాత్తుగా ఇంటికి వచ్చి.. వీళ్లద్దరిని రెడ్ హ్యాండెండ్ గా పట్టుకుంటాడు.
undefined
దాంతో ఆవేశం... ఆయాశం.. వివాదం.. విధ్వసం. చివరకు ఆ పనోడి చేతిలో మన భర్తగారు హతం. అప్పుడు భార్య అయినటువంటి శ్రీ రాపాక ఆ హత్య ను పనివాడి మీద నెట్టేసి.. తన దొంగ ఏడుపు మొదలెడుతుంది. అప్పుడేమవుతుంది.. భర్త దెయ్యమై ఆమె మీద పగ తీర్చకుంటాడా..లేక పనోడే ఆమెను ఒక హత్య చేసినా ఒకటే.. వంద హత్యలు చేసినా ఒకటే అని ఓ పోటు పొడుస్తాడా వంటి ప్రశ్నలకు తెర మీద సమాధానం దొరుకుతుంది అని చెప్పను.ఎందుకంటే అలాంటిదేమీ జరగదు..అక్కడితో అర్దాంతరంగా... ఓ రకంగా అర్దవంతంగానో.. మన అదృష్టం బాగుండో శుభం లాంటి ది ఎండ్ కార్డ్ పడుతుంది కనుక. వెంటనే పెద్ద నిట్టూర్పు వినిపిస్తుంది. అది మనదే అని కాసేపటికి మనకు అర్దమవుతుంది.
undefined
ఎలా ఉంది..ఏముందని ఈ సినిమాలో .. ఎలా ఉందని విశ్లేషణ చేయటానికి... వర్మగారి మీద గౌరవంతో బహిరంగంగా తిట్టిపోయలేం. రెండు వందలు పోగొట్టుకున్నందుకు కాదు... ఇలాంటి చెత్తను మనను చూసేలా చేసినందుకు. వర్మ బ్రాండ్ కు కాలం చెల్లిందేమో... మధ్యం పేరుతో కల్తీ అమ్ముతున్నట్లు... ఇలాంటి సినిమాలతో కల్తీలేని ఆయనపై అభిమానం పలచబడటం తప్ప ఒరిగేదేమీ ఉండదు.
undefined
ఇంతటి మహాద్బుతమైన కథలో టిపికల్ కెమెరా యాంగిల్స్ కాస్తంత హలో చెప్పి పలకరిస్తూంటాయి. ట్విస్ట్ లు, టర్న్ లు, ఎమోషన్స్, డ్రామాలు, పుల్ స్టాప్ లు ఉండవు. ఒకటేస్టోరీ లైన్.. లైన్ దాన్ని పట్టుకునే స్టోన్స్ లా తగిలే సీన్స్.
undefined
థియోటర్ లో ఇలాంటివి రిలీజ్ చేయనందంకు సంతోషించాలి. లేకపోతే మలయాళ బూతు సినిమా అనుకుని డబ్బింగ్ రైట్స్ కోసం ఇతర భాషల వాళ్లు ఎగబడేవారేమో. ఇరవై రెండు నిముషాల షార్ట్ ఫిలిం ను ఒక వ్యూకు 200 రేటుకు అమ్ముకోగలిగిన ఆయన తెలివికి జోహార్లు అర్పించాలి. ఈ పోస్టర్, ట్రైలర్ చూసి చాలా మంది ఆవేశపడతారు.. బొక్క బోర్లా పడతారు.
undefined
అయితే సినిమాలు ఏమీ లేని టైమ్ లో.... ముఖ్యంగా బూతు తెలుగు సినిమాలు ..ఏడు చేపల కథలు లాంటివి కూడా రిలీజ్ లేని టైమ్ లో ఆ లోటుని తీరుస్తుందనటంలో సందేహం లేదు. జనాలని నగ్నం చేసి దోచుకోవటం అంటే ఇదే.. ఇందలో వర్మ ఆరితేరారనటంలో సందేహం లేదు. ఇంటర్నెట్‌లో అత్యధికంగా సెర్చ్ చేసే 'పోర్న్‌హబ్' వెబ్‌సైట్‌కు దాదాపు నెట్‌ఫ్లిక్స్, లింకిడిన్ అంత పాపులారిటీ ఉందనే విషయం వర్మకు తెలిసిపోయిందని అర్దం చేసుకోవాలి.
undefined
నటీనటులకో నమస్కారంఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన శ్రీ రాపాక తన పాత్రకు తగ్గట్లు ఏ మాత్రం మొహమాటం లేకుండా తన అందచందాలతో తన సెక్సీ మూమెంట్స్ తో మెప్పించే ప్రయత్నం చేయటం... తెలుగు తెరకు మరో సన్నిలియోన్ దొరికినట్లే అని మురవాలి. అదే సమయంలో భర్త (కేశవ్ దీపక్), పనోడు చేసిన ఇద్దరు నటులు కూడా తమ పాత్రలకు న్యాయం లాంటి అన్యాయం చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. రెగ్యులర్ గా వర్మ సినిమాల్లో వినేదే. కెమెరా కూడా ఎక్కడా కుదరుగా ఉండకుండా వర్మ షాట్ డివిజన్ ని అనుకరిస్తూంటుంది.
undefined
ప్లస్ లులీడ్ యాక్టర్ స్వీటీకెమెరా యాంగిల్స్బ్యాక్ గ్రౌండ్ స్కోర్మైనస్ లుచెత్త కథపరమ బోర్ స్క్రీన్ ప్లే
undefined
ఫైనస్ థాట్అవునూ హీరోయిన్ కు శ్రీ రాపాక అని పేరు పెట్టారేంటి...ఎక్కడో విన్నట్లుంది కదూ ఈ పేరు?Rating : 15---సూర్య ప్రకాష్ జోశ్యుల
undefined