రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు బెస్ట్ ఫిల్మ్ మేకరే కాదు, బెస్ట్ ఎనలిస్ట్ కూడా. ఇప్పుడు ఆయన దర్శకుడిగా సక్సెస్ కాలేకపోతున్నాడు, కానీ ఆయనలో మాత్రం మంచి క్రిటిక్ ఉన్నాడనేది నిజం. ఇక ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ తన మార్క్ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఇప్పుడు `సిండికేట్` అనే సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, జేడీ చక్రవర్తి, నాగార్జున, మోహన్ లాల్, అజయ్ దేవగన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. వీరితోపాటు మరో స్టార్ హీరో కూడా ఉంటారని సమాచారం. ఈ మూవీని ప్రకటిస్తూ, `అత్యంత భయంకరమైన జంతువు ఒక్క మనిషి మాత్రమే` అనే పాయింట్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు.