Ram Gopal Varma: వర్మ ఇలా ఉంటే వాళ్ళ అమ్మగారు ఎలా ఉండాలి...! ఇద్దరూ కలిసి జీఎస్టీ మూవీ చూశారట!

Published : Dec 18, 2022, 01:11 PM IST

దర్శకుడు వర్మ తిక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వర్మకు మించిన తిక్క వాళ్ళ అమ్మగారికి ఉందని తాజా ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది. ఆమె చేసిన బోల్డ్ కామెంట్ వైరల్ అవుతుంది.   

PREV
17
Ram Gopal Varma: వర్మ ఇలా ఉంటే వాళ్ళ అమ్మగారు ఎలా ఉండాలి...! ఇద్దరూ కలిసి జీఎస్టీ మూవీ చూశారట!
Ram Gopal Varma

మొన్నటి వరకు బూతు చిత్రాలు తీసిన వర్మ(Ram Gopal Varma) ఇప్పుడు బూతు ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. అషురెడ్డి, అరియనా, సిరి స్టేజిలతో ఆయన వరుసగా బోల్డ్ ఇంటర్వ్యూలు చేశారు. ఈ ఇంటర్వ్యూల వలన ఎవడికి ఉపయోగం, వర్మ మరింత దిగజారిపోతున్నాడని కుటుంబ సభ్యులే విమర్శలు చేస్తున్నారు. ఇక యాంటీ ఫ్యాన్స్, సాంప్రదాయ వాదులు తిట్టుకుంటున్నారు.

27

ఆయన కీర్తి, గౌరవంలో ఆవగింజంత సరితూగని అషురెడ్డి అందానికి దాసోహం అనడం, ఆమె పాదంపై ముద్దు పెట్టి, కాలి వేళ్ళు నోట్లో పెట్టుకోవడం పిచ్చికి పరాకాష్ట. సమాజం ఒప్పుకోలేని ఏహ్యమైన చర్య. ఐశ్వర్య, శ్రీదేవి లాంటి భూలోక సుందరీమణులను తన ఆదేశాలతో వెండితెరపై ఆడించిన వర్మ... అషురెడ్డికి బానిస కావడం నిజంగా దురదృష్టకరం. 
 

37
Ram Gopal Varma

వర్మ లాంటి మనిషి ఎక్కడా ఉండడు. ఆయన తిక్క, తెగింపు వేరొకరికి రాదు. వర్మ ఇలా ఉంటే వాళ్ళ అమ్మగారు ఇంకా దారుణంగా ఉన్నారు. వర్మ తల్లి సూర్యమ్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆమె చేసిన ఒక కామెంట్ అందరి మైండ్ బ్లాక్ చేసింది. 
 

47
Ram Gopal Varma

జి ఎస్ టి(గాడ్ సెక్స్ ట్రూత్) సినిమా వర్మతో కలిసి చూశానని చెప్పారు. అమెరికా పోర్న్ యాక్టర్ మియా మల్కోవాతో వర్మ ఈ అడల్ట్ కంటెంట్ మూవీ చేశారు. మియా మాల్కోవా పూర్తి నగ్నంగా ఆ మోనోలాగ్ చిత్రంలో నటించారు. ఆడవాళ్ళ అంగాగాన్ని వివరిస్తూ భిన్న కోణాల్లో మియా మల్కోవాను వర్మ చూపించాడు. ఆ సినిమాను వర్మ తల్లి సూర్యమ్మ చూశాను అని చెప్పడం, అది కూడా వర్మతో కలిసి చూశానని చెప్పడం నభూతో నభవిష్యతి. 
 

57
Ram Gopal Varma

ఇలాంటి ఫ్యామిలీ బహుశా ప్రపంచంలో  ఎక్కడా కనిపించదేమో. అలాగే వర్మ గురించి సూర్యమ్మ మరిన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. వర్మ ఇక జీవితంలో మారడు. తనకు తాను మారాలి అనుకుంటే మారతాడు, ఒకరు చెప్పాడని మారడు, అని కుండబద్దలు కొట్టింది.

67


ఇక తానంటే వర్మకు ఎంతో ఇష్టం అట. ఇంటికి రాగానే వర్మకు వాళ్ళ అమ్మగారు కనిపించాలట. లేదంటే వర్మకు కోపం వస్తుందట. అమ్మను చూడగానే వర్మకు ఎక్కడలేని సంతోషం కలుగుతుందట. కళ్ళలో ఒక మెరుపు, వెలుగు కనిపిస్తాయట. 
 

77


రామ్ గోపాల్ వర్మ భార్యతో విడిపోయి చాలా కాలం అవుతుంది. వర్మ భార్య పేరు రత్న. వీరికి ఒక కూతురు ఉన్నారు. వర్మ కూతురు పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయినట్లు సమాచారం. కాగా వర్మ ఇటీవల వ్యూహం టైటిల్ తో ఒక పొలిటికల్ డ్రామా ప్రకటించారు. జనవరిలో షూట్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. 
 

click me!

Recommended Stories