రాంగోపాల్ వర్మ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది వివాదాలు మాత్రమే. వివాదాస్పద కామెంట్స్ తో వర్మ నిత్యం వార్తల్లో ఉంటారు. ఆయన తెరకెక్కించే చిత్రాలు కూడా సినీ రాజకీయ వర్గాల్లో చర్చకి దారితీస్తుంటాయి. తాజాగా రాంగోపాల్ వర్మ ఒక కేసులో చిక్కుకున్నారు. ఈ కేసులో ముంబై కోర్టు వర్మకి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.