పిల్లల్ని కనడం 20 ఏళ్ల ప్రాజెక్ట్... ఎమోషనల్ ఈవెంట్ ని బిజినెస్ కోణంలో చూసిన మెగా కోడలు ఉపాసన!

Published : Dec 13, 2022, 04:45 PM IST

మెగా ఫ్యాన్స్ చిరకాల కోరిక నెరవేరింది. రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారు. దశాబ్దకాలంగా చిరంజీవి అభిమానులను వెంటాడుతున్న వేదన వీడింది. 

PREV
16
పిల్లల్ని కనడం 20 ఏళ్ల ప్రాజెక్ట్... ఎమోషనల్ ఈవెంట్ ని బిజినెస్ కోణంలో చూసిన మెగా కోడలు ఉపాసన!
Ram Charan

పిల్లల్ని కనడం సామాజిక బాధ్యత. ఆధ్యాత్మికంగా కూడా ఇది పవిత్ర కార్యం. భార్యాభర్తలు పిల్లల్ని కని మానవజాతి మనుగడకు అవసరమైన మరో తరాన్ని అందించాలి. రెండు దశాబ్దాల ముందు తల్లిదండ్రులు సంతానం విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టుకునేవారు కాదు. సంతానం దైవ ప్రసాదంగా భావించి వారసులను ఈ లోకంలోకి ఆహ్వానించేవారు. 
 

26
Ram Charan Upasana


 కాలంతో పాటు మనుషుల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది.తల్లిదండ్రులు కావడానికి మీనమేషాలు లెక్క పెడుతున్నారు. దీనికి ఒక పద్ధతి, ప్రణాళిక ఉండాలని చెబుతున్నారు. కాగా ఉపాసన-రామ్ చరణ్ వివాహం జరిగి పదేళ్లు దాటిపోయింది. అయినా వారు పిల్లల్ని కనలేదు. ఓ ఏడాది అటూ ఇటుగా పెళ్లి చేసుకున్న అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరేసి పిల్లల్ని కన్నారు. అల్లు అర్జున్ కూతురైతే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. 

36
Ram Charan Upasana

రెండు మూడేళ్లంటే ఎవరైనా పట్టించుకోరు. మరీ పదేళ్లు పిల్లల్ని కనకపోవడం ఏమిటీ? అసలు సమస్య ఎక్కడ ఉంది? ఆరోగ్య సమస్యలు ఉంటే... పెద్ద మెడికల్ సామ్రాజ్యమే నడుపుతున్న ఉపాసనకు తెలియని వైద్యం ఉంటుందా?. ఇక జీవితంలో సెటిల్ కావాలి అనుకోవడానికి... దోమకొండ సంస్థానం వారసురాలిగా ఒక్క ఉపాసన వాటా విలువే పదివేల కోట్లు ఉంటుంది. 

46
Ram Charan


ఇక సమయం అంటారా... పిల్లల కోసం కూడా టైం కేటాయించకపోతే, ఈ బిజీ జీవితాలు, వెనకేసే కోట్లు ఎవరి కోసం?... ఇలా పలు ప్రశ్నలు మెగాస్టార్ అభిమానులను వెంటాడాయి.ఎట్టకేలకు చిరంజీవి ప్రకటన వాళ్ళకు ఎక్కడలేని ఎనర్జీ ఇచ్చింది. మెగా వారసుడు వస్తున్నాడని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 
 

56
Ram Charan Upasana


కాగా ఉపాసన గతంలో పిల్లల్ని కనడంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తల్లి కావడం అనేది 20 ఏళ్ల ప్రాజెక్ట్. తల్లిదండ్రులు కావడానికి మానసికంగా, శారీరకంగా సిద్ధం కావాలి. ప్రపంచంలోకి మనం ఒక ప్రాణిని తీసుకురావడం అతి పెద్ద బాధ్యత. మన పిల్లలకు ఏం కావాలి? ఎలా పెంచాలి?... ఇలా అనేక విషయాల మీద అవగాహన ఉండాలి. 

66


అప్పుడు మాత్రమే మనం తల్లిదండ్రులు కావాలి.  పిల్లలకు మంచి జీవితం ఇవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లు, సన్నద్ధత తల్లిదండ్రులు కలిగి ఉండాలి. పూర్తి స్థాయిలో సిద్దమయ్యాక మనం ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలి, అని ఉపాసన చెప్పుకొచ్చారు. ఒక బిజినెస్ ఉమన్ గా ఎమోషనల్ ఈవెంట్ ని కూడా ఉపాసన చాలా ప్రాక్టికల్ అండ్  ప్లానింగ్ గా మాట్లాడారు. ఒకప్పటి జనరేషన్ ఉపాసన మాటలు వింటే నవ్వుకుంటారు. నారు పోసినవాడు నీరు పోయడా... అనేది వాళ్ళ సిద్ధాంతం. 
 

click me!

Recommended Stories